విద్యుత్ సంక్షోభంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు బొత్ససత్యనారాయణ ఈ పరిస్థితిని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవటానికి పావులు కడుపుతున్నారు. వారిరువురి మధ్యన రాజకీయ వైరుధ్యం మొదటినుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే. విద్యుత్ సంక్షోభం వల్ల ఇబ్బుందులు పడుతున్న ప్రజలకు ఒక్కడుగు ముందుకువేసి పిసిసి అధ్యక్షులు బొత్ససత్యానారాయణ క్షమాపణలు చెప్పారు.
ఈ సంక్షోభంపై కేంధ్రంతో చర్చించటానికి బయలుదేనిన ముఖ్యమంత్రి ఇంకా ఢిల్లీకి చేరుకోకముందే బొత్స ప్రజలకు క్షమాపణలు కోరటం చూస్తే వారి మధ్యన రగులుతున్న ఆదిపత్య పోరుకు అద్దంపడుతుంది. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి గ్యాస్ కొరతే ప్రధాన కారణం అని ఇటివల ముఖ్యమంత్రి అనేకమార్లు ప్రకటించారు. కానీ అందుకు భిన్నంగా ఈ సంక్షోభానికి 2008 లో ఉన్న ప్రభుత్వం, జాతీయస్థాయిలో అనుసరిస్తున్న విధానమే కారణం అని బొత్స చెప్పారు.
ఇలా ఎవరికివారే పార్టీ అధ్యక్షునిగా, ముఖ్యమంత్రిగా తమ ఆధిపత్యాన్ని కాపాడుకుంటూనే భిన్నాభిప్రాయాలతో పరిస్థితిపై అంచనా వేస్తున్నారు. ఇలా విద్యార్థుల ఫీజురీయంబర్స్‌మెంట్ ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులు పార్టీలో సంస్థాగతపరమైన అంశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అనేక అంశాలపై పార్టీ అధ్యక్షునికి, ముఖ్యమంత్రికి మధ్య అంతర్గత వైరుధ్యం కొనసాగుతూనే ఉంది.
ఇలా ఎవరిదారి వారిదే అన్నట్లుగా వ్యవమిరిస్తున్నా కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స వేర్వేరు వేళలో ఢిల్లీ వెళ్లారు.
మరింత సమాచారం తెలుసుకోండి: