హైదరాబాద్: కలకాలం నిలిచిపోయేది స్నేహం ఒక్కటే. ఈ మానవాళిలో అత్యంత తీయనైనది. అద్భుతమైనది. ఎల్లలు లేనిది. స్వార్ధం లేనిది. రక్తసంబంధాలకు, బంధుతత్వాలకతీతంగా, ధనికులు, పేదలనే తేడా లేనిది. కులాలు, మతాలు, వర్ణాలు తెలియనది. ఒక మాటలో చెప్పాలంటే ఇద్దరి మనుషుల మధ్యన అల్లుకుపోయే బంధమే స్నేహబంధం. స్నేహంలోని గొప్పదనం గురించి మాటల్లో ఎంత చెప్పినా తక్కువే. అది అనుభవిస్తే తప్ప అందులో ఉన్న మధురం మనకు తెలియదు.
స్నేహమంటే స్వచ్చమైన పాలలాంటిదన్నమాట. స్నేహం గురించి చెప్పడం కంటే స్వార్ధం లేని స్నేహం చేసిన వాళ్లకు తెలుస్తది. కొందరి స్నేహం చూస్తే అసూయపడే విధంగా ఉంటుంది. స్నేహంలో ఉన్న గొప్ప తనమది. ఈ రోజు అంతర్జాతీయ ఫ్రెండ్ షిప్ డే. ఫ్రెండ్ షిప్ ఏర్పడి నేటికీ 77ఏళ్లు పూర్తి చేసుకుని 78వ ఏట అడుగిడుతున్న ఈ సందర్భంగా దశాబ్దాల పాటుగా స్నేహాన్ని కొనసాగిస్తున్న కొందరి గురించి తెలుసుకుందాం.
రాజశేఖర్ రెడ్డి-కేవీపీ
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి-రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఇద్దరు మంచి స్నేహితులు. రాజశేఖర్ రెడ్డి ఆత్మగా కేవీపీని పిలుస్తారు. కేవీపీని కాదనీ వైఎస్ ఏ పనీ చేసేవాడు కాదు. కేవీపీ కూడా వైఎస్‌కు ఏనాడు ఎదురు చెప్పేవాడు కాదు. వీరిద్దరి స్నేహం దాదాపుగా 4దశబ్దాలపైబడే. వీరివురు కర్నాటకలోని గుల్బర్గా మెడికల్ కళాశాలలో చదువుకుంటున్న కాలంలో పరిచయం కాస్త స్నేహంగా కుదిరింది. ఆ స్నేహం ఎంత వరకు వెళ్లిందంటే ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనీ వరకు వెళ్లింది. తమ స్నేహాన్ని ఎవరూ విడదీయలేరనీ ఆ ఇద్దరు అనేక పర్యాయాలు చెప్పుకున్నారు. రాజశేఖర్ రెడ్డి-కేవీపీల స్నేహం మొదలైనప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి చనిపోయే దాకా ఒకర్ని విడిచి మరొకరు ఉండలేదు. అది కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, అధికారం కావచ్చు. వీరిద్దరు అన్నింటిని షేరు చేసుకునే వారు. వీరిద్దరి స్నేహం చూసి అందరూ అసూయపడేవారు. రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యాక కేవీపీకి ప్రభుత్వంలో పెద్దపీఠ వేశారు. దీనిపై అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చినా వైఎస్ ఏనాడు పట్టించుకోలేదు. కేవీపీని రాష్ర్ట ప్రభుత్వ సలహాదారుడుగా నియమించే విషయంలో కావచ్చు, రాజ్యసభ ఇప్పించే విషయం కావచ్చు, శాంతిభద్రతల కమిటే ఛైర్మన్ గా నియమించే విషయంలో కావచ్చు. కేవీపీ కోసం రాజశేఖర్ రెడ్డి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. వేటినీ వైఎస్ పట్టించుకోలేదు. నవ్వుతూ ముందుకు సాగాడు. తన స్నేహితుడికి ఏం చేయాలో అది చేశాడు. రాజశేఖర్ రెడ్డి తుది శ్వాస విడిచే వరకు వారి స్నేహం కొనసాగింది. చరిత్రలో వీరిద్దరి స్నేహం శాశ్వతంగా మిగిలిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
జయలలిత-శశికళ
జయలలిత ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి . జయలలితకు అత్యంతమైన ఆప్తురాలు శశికళ. జయలలిత -శశికళల ఇద్దరి స్నేహానికి దశాబ్దాల చరిత్రనే వుంది. వీరిద్దరు కష్టాల్లో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారు. గత ఏడాది కిందట వీరిద్దరి మధ్యన తాత్కాలికమైన మనస్పర్ధలు(ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వచ్చిన అభియోగాలతో కావాలనే ఇద్దరు కొంత దూరమయ్యేరా తప్ప మరొకటి కాదు)వచ్చినా ఇద్దరూ మళ్లీ కలిసిపోయారు. శశికళ కోసం జయలలిత కూడా అనేక ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ, ఏనాడు కూడా జయలలిత వాటిని ఖాతరు చేయలేదు. పై పెచ్చు మరింత పెద్దపీఠను వేసింది. ఆపదలో అన్ని రకాలుగా అండగా నిలిచిన శశికళను జయలలిత ఏనాడూ వేరుగా చూడలేదు. విడిచి ఉండలేదు. తన అంతర్భాగంలో ఒకటిగానే చూసిందామె. శశికళ కూడా జయలలితను అంతకంటే ఎక్కువగానే ప్రేమించింది. ఎవరకీ సమస్యలు వచ్చినా అవి తమవనే భావంతో ఇద్దరూ పాలుపంచుకున్నారు. కష్టనష్టాలకు వారు ఏనాడూ భయపడి పారిపోలేదు. ఇద్దరు కలిసి ఎంతో ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నారు. దాని ఫలితమే మరోమారు తమిళనాట జయలలిత సీఎంగా కావడం. వీరిద్దరి స్నేహంపై తమిళనాటనే కాకుండా, యావత్ దేశ వ్యాప్తంగా కూడా అనేక రకాలుగా ఊహాగానాలు వచ్చాయి. కానీ, ఏనాడు జయలలిత వాటి గురించి పట్టించుకోలేదు. వీరిద్దరి స్నేహం కూడా అందరికీ ఆదర్శమే.
సూర్య చంద్రులు ఉన్నంత కాలం స్వచ్చమైన స్నేహమూ ఉంటోంది.
చివరగా..... దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్ వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం... అంటూ ఓ సినీ కవి స్నేహం గురించి చక్కగా వర్ణించారు. దీన్ని బట్టి స్నేహమంటే ఏమిటో అర్థమవుతోంది.
‘‘చిరు నవ్వుకు మరణం లేదు’’, ‘‘స్నేహానికి అంతం లేదు’’.
మరింత సమాచారం తెలుసుకోండి: