పైసలతో సరి...పదవీ లేదు మరి...!?

 హైదరాబాద్: కష్టకాలంలో రాష్ర్టంలోని కాంగ్రెస్ సర్కార్ను ఆదుకున్న ప్రజారాజ్యం పార్టీ మాజీ అధినేత, ప్రస్తుత కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ చుక్కలు చూపిస్తోంది. కనీసం కలవడానికి కూడా టైం ఇవ్వడం లేదట. తద్వారా పీఆర్పో విలీనం సందర్భంగా కాంగ్రెస్ చేసుకున్న ఒప్పందాలు, ప్రమాణాలు గాలికి వదిలి వేసినట్లు సంకేతాలు ఇవ్వకనే ఇస్తున్నట్లు కనిపిస్తోంది. క్లిష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినందుకు కేంద్రంలో మంత్రి పదవీని కానుకగా ఇస్తారనీ మొన్నటి వరకు జోరుగా ప్రచారం జరిగింది. చిరు కూడా కాంగ్రెస్ పై బోలెడు ఆశల్ని పెట్టుకున్నారు. అయితే, నాల్గు రోజుల కిందట కేంద్రంలో స్వల్పమార్పులతో సరిపెట్టింది కాంగ్రెస్. దీనితో ఇప్పట్లో చిరంజీవికి కేంద్ర మంత్రి పదవీ రాదనీ తేలిపోయింది. ఇస్తారనుకున్న, వస్తాదనుకున్న కేంద్ర మంత్రి పదవీ మాత్రం రాలేదు. కానీ, ఆయన అనుకోనిది, ఊహించనది మాత్రం దక్కింది. అదేనండీ. చెన్నైలోని తన కుమార్తె సుస్మిత ఇంట్లో దొరికన 35కోట్ల నల్ల డబ్బును కాస్త ఐటీ అధికారులు తెల్ల డబ్బును చేసి చిరంజీవి ఇంటికి సేఫ్ గా పంపించారట. చిరంజీవి ఆశించింది ఒకటయితే మరోటి జరిగిందట. కేంద్రంలోమంత్రి పదవీ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు కానీ, కేంద్రం ద్వారా చెప్పించుకుని నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చుకోవడంలో చిరంజీవి సక్సెస్ అయ్యాడనీ కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనితో రావనుకున్న డబ్బులు ఇంటికి క్షేమంగా వచ్చినందుకు సంబరపడలా? అనుకున్న పదవీ రానందుకు బాధపడలా?ఇది తేల్చుకోలేక చిరంజీవి సతమతమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కేంద్ర మంత్రి వర్గంలో స్వల్ప మార్పులు చేసిన సందర్భంగా చిరంజీవి ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రినట్లు సోనియాగాంధీని కలువాలనీ టెన్ జన్ పథ్ను అపాయింట్ మెంటు కోరాడట. అయితే, ఇప్పట్లో కలిసే అవకాశం లేదనీ తిరస్కరించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీనితో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో చిరు వర్గం అయోమయంలో పడ్డట్లు తెలుస్తోంది.  కాంగ్రెస్ పార్టీలో చిరుకు విలువ లేకుండా పోవడంతో ఆయనను నమ్ముకున్న వారు కూడా ఆయనకు మెల్ల మెల్లగా దూరమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడిప్పుడే చిరంజీవికి అర్థమవుతున్నాయట. రాష్ర్టంలోని కాంగ్రెస్ పార్టీ సర్కార్ను జగన్ వర్గీయులు పడగొడతానంటే చిరంజీవి తనకున్న 17మంది ఎమ్మెల్యేలతో తొడలుగొట్టి మరీ కాపాడారు. అయితే, ఇప్పటి వరకు ఆయనకు కేంద్ర మంత్రి పదవీపై ఎలాంటి హామీ దొరకలేదనీ తెలుస్తోంది. మరో 20నెలలు పోతే సాధారణ ఎన్నకలే. ఇప్పటికిప్పుడు ఆయనకు ఏదైనా మంత్రి పదవీ ఇస్తేనే ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన దానికి ఏమైనా ఫలం దక్కినట్లవుతోంది. లేదంటే, చెన్నైలోని తన కూతురు ఇంట్లో ఐటీ అధికారులు స్వాధీనం చేసుకుని, ట్యాక్సు కట్టించుకుని వైట్ మనీగా చేసి పంపించిన డబ్బుతో చిరు సరిపెట్టుకోవల్సిందేనట. చిరుకు కాంగ్రెస్ ఇచ్చే నజరాన, కానుక ఇదే అని భావించాలనే అనే వారు ఉన్నారు. ఏది ఏమైనా చిరుకు మరో గత్యంతరం లేదు సుమీ! 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: