రింజిం రింజిం హైదరాబాద్

రింజిం రింజిం హైదరాబాద్ రిక్షావాలా జిందాబాద్ అంటూ మన ఎన్టీవోడు సినిమాలో మన రాజధాని పోటుగాడి గూర్చి జోరుగా పాడితే రాష్ట్రమంతా హుషారుగా చూసి ఎగిరి గంతులేసారు. కాని ఇన్నాళ్లకు అది నిజజీవితంలో చేసిచూపాక మన ఆనందానికి అవధులేవి. విశాలభారతదేశంలో ఇసుమంత ప్రాంతం మనది.కాని అంతర్జాతీయ క్రీడావిపణిలో భారతకీర్తి పతాకను అది ఎగరవేస్తే దానికి మించిన సార్థకథ ఇంకేం ఉంటుంది. అవినీతిలో, ఎక్కడ ఉగ్రవాదం పంజా విసిరిన దాని మూలాలు హైదారాబాద్ లో లభిస్తూ పరువుపోతున్న సమయాన వారే కాదు వీరు ఉన్నారంటూ రాష్ట్రరాజధానినే కాదు తెలుగోని గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు మొన్న గగన్ నారంగ్,నేడు సైనా నెహ్వాల్. ఇంత పెద్దదేశం కాని క్రీడా ప్రపంచంలో అతి చిన్నదిగా మారింది. ఒక్క పతకమూ తేకుండా ఒలంపిక్స్ నుంచి రావడమే తప్ప గెలవడం తెలియని భారత్ కు ఆకోరిక నెరవేర్చింది మన హైదరాబాదీలు కావడం గర్వకారణం. ఎప్పుడో హాకీలో స్వర్ణం, పరుగులో పిటి ఉష తెచ్చిన మరో పథకం, షూటింగ్ లో ఒకసారి జవాను తెచ్చిన రజతం ఇలా వేలిపై లెక్కపెట్టినా క్షణాల్లో మన క్రీడా చరిత్ర పూర్తవుతోంది. ఎప్పుడు ఒలంపిక్స్ జరిగినా ఇతర దేశాలు సాధించిన పతకాల గూర్చి మాట్లాడు కోవడం తప్ప మరేమి చేయలేని స్థితిలో ఉన్న భారతీయులకు ఈసారి ఆదురవస్థ నుంచి తొలుత షూటింగ్ లో కాంస్యం సాధించిన హైదరాబాది గగన్ నారంగ్ దూరం చేసారు. ఆ ఆనందపు ఘడియలు ఆస్వాధిస్తుండగానే మరో క్రీడాకెరటం హైదరాబాదీ సైనానెహ్వాల్ భారతావనిని ఆనంద డోలికల్లో తేలి ఆడించేందుకు సిద్దమైంది. క్వార్టర్ ఫైనల్ విజయం సాధించి పతకాన్ని దాదాపు ఖరారు చేసుంది. ఓడినా కూడా పతకం వచ్చే అవకాశాలున్నప్పటికి గెలిచి స్వర్ణ పతకాన్ని సాధించి దేశం గర్వించేలా చేయాలని ప్రతిఒక్కరు ప్రార్థించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: