పార్థా... అంటూ నీతులు చెప్పే ‘గీత‘ను భోదించే శ్రీకృష్ణులు లేరిప్పుడు.పక్కనే ఉంటూ పక్కదారి పట్టించి పడగొట్టే వారున్న కాలమిది. అయినా ముద్దుగా పార్థసారథి అంటూ లోకానికి గీతాసారాంశాన్ని అందించిన శ్రీకృష్ణభగవానుని పేరు పెట్టుకుని ఆయన చెప్పిన గీత నే దాటితే పలితం ఇలాగే ఉంటుంది మరి. నేరస్థుడు పోటీకే అనర్హుడు,అది చిన్నదా పెద్దదా అన్నది కాదు.అలాంటిది శిక్ష ఖరారయ్యాక కూడా పదవిలో ఉండాలను కోవడం పార్థసారథి మనస్సాక్షికే వదిలివేద్దాం.చట్టంలో ఉన్న శిక్షాకాలాన్ని సాకుగా చూపితే ఎవరేమంటారు. శిక్షాకాలం ఎంతైనా నేరస్థుడివేనని కోర్టు నిర్ధారించినట్టే. ఒకప్పుడు ఆరోపణలు వస్తేనే అవి రుజువు అయ్యేంతవరకు పదవులకు రాజీనామాలు చేసి ప్రజాజీవితానికి దూరంగా ఉండి రాజకీయాలకే వన్నెతెచ్చిన నేతలున్న తెలుగునేల వారసులు వీరేనా అని జనం చీదరించుకునే స్థితి రాకూడదెవరికి. కోర్టు పార్థసారథికి ఇచ్చిన అవకాశం పైకోర్టుకు వెల్లి శిక్షలో మార్పు తెచ్చుకునేందుకే అన్న విషయం కూడా ఆయన మర్చిపోవద్దు. తెలిసిన విషయం దాచి రెండు సార్లు ప్రజాప్రతినిధిగా గెలిచి తప్పుచేశారు. ఈవిషయంలో ఎన్నికల నియమావలి ప్రకారం ఎమ్మేల్యే గిరీనే ఊడవచ్చు.అధికారంలో ఉన్నాం కదా ఏమైనా చేయవచ్చన్న నమ్మకం మంత్రివర్యులకు ఉందేమో తెలియదు. కాని సహచరమంత్రి ఒకరు జైలుపాలవగా మరోఐదుగురు కేసుల్లో ఇరుక్కుని చచ్చిచెడి వారి ప్రభుత్వం నుంచే ఎన్నో విమర్శల మద్య న్యాయసహాయం పొందగలుగుతున్నారన్న విషయాన్ని ఆయన మరవద్దు. విపక్షాల విమర్శలు మొదలయ్యాయి, ఇవి ఇంకా పెరిగితే పార్టీనే పరువుకోసం పదవిని ఊడగొడితే మరింత అప్రతిష్ట పాలయి రాజకీయభవిష్యత్తుకే దెబ్బరావచ్చు. అనుకున్నామని అయి పోవన్నీ...అనుకోలేదని ఆగవు కొన్ని...జరిగేవన్ని మంచికని.. అన్నపాటలోని అర్థాన్ని గమనించైనా పార్థసారథి...తన రాజకీయరథానికి సరైన సారథిగా నిర్ణయం తీసుకోవాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: