లోకేష్ బాబొచ్చారు!

Kuthuru Raji Reddy
రాష్ట్రంలో కొన్ని సంవత్సరాల పాటు అధికారంలో ప్రస్థుతం ప్రతిపక్షపార్టీ గా కొనసాగుతున్నటువంటి తెలుగుదేశంపార్టీలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అంతేకాకుండా భవిష్యత్తులో పార్టీలో కీలక పాత్ర పోషించనున్నారు. టిఆర్ఎస్ నేత కెసిఆర్ వారసులైనటువంటి కెటిఆర్, కవితలు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ వారసులు జగన్మోహన్ రెడ్డి, షర్మిలతోపాటు మరికొంతమంది నాయకుల వారసులు రాజకీయాల్లో వచ్చి కీలకంగా వ్యవహరించడంతో తన వారసున్ని ఎందుకు రాజకీయాల్లోకి దించవద్దనుకున్నాడో ఏమో కాని ఏకంగా తన వారుసుడైన లోకేష్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించారు. తొలుత తన కుమారున్ని రాజకీయాల్లోకి రానివ్వని చెప్పినటువంటి బాబు అందుకే రాజకీయాలకు దూరంగా విదేశాల్లో చదివించారు. అంతేకాదు ఉద్యోగమో, వ్యాపారమో చేసుకుంటాడు కాని లోకేష్ ను రాజకీయాల్లోకి దించనని పలుమార్లు వెల్లడించారు. కాగా ఒక్కసారిగా చంద్రబాబు మనసు మార్చుకున్నారా లేదా లోకేష్ రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిని పెంచుకున్నాడో తెలియదు గాని చివరకు చంద్రబాబు వారసత్వ రాజకీయాల్లోనే అడుగులు వేస్తున్నారు. లోకేష్ రాజకీయాల్లోకి రావడమే కాకుండా ఇప్పుడు అన్ని తానై పార్టీని నడిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం 63 సంవత్సరాల తన వయస్సును లెక్కచేయకుండా నిరంతరం శ్రమిస్తూ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. చంద్రబాబు పాదయాత్రకు అంకితం కావడంతో లోకేష్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్ కు సంబంధించిన కార్యకలాపాలతో పాటు స్వంత జిల్లా చిత్తూరు రాజకీయాలను ప్రత్యక్షంగా చూస్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గ నాయకులతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులతో నేరుగా మాట్లాడుతున్నారు. దీంతో పాటు ట్విట్టర్ ద్వారా ప్రత్యర్థులను విమర్శిస్తు ప్రజల దృష్టికి ఆకర్షిస్తున్నారు. రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్రను వేసుకోవాలని లోకేష్ ముందుకెళ్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: