శంకర్రావుకు సీఐడీ నోటీసులు! సుస్మిత లేఖ!

Durga
మాజీ మంత్రి శంకర్రావుకు గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ అధికారులు శనివారం నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో తమ ఎదుట విచారణకు హాజరుకావాలని శంకర్రావును సీఐడీ అదేశించింది. కాగా, గత నెలలో ఇదే అంశంలో విచారణలో భాగంగా శంకర్రావును బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అనారోగ్యానికి గురయ్యారు. దాంతో కొంతకాలం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన్ను ఆస్పత్రి నుంచి మంగళవారంనాడు డిశ్చార్జ్‌ చేసిన సంగతి తెలిసిందే.  అయితే ఆయన కుమార్తె సుస్మిత శనివారం సీఐడీ అధికారులకు లేఖను అందజేశారు. తన తండ్రి అనారోగ్యంగా ఉన్నందున సిఐడీ అధికారుల మందు విచారణకు హాజరు కాలేకపోతున్నారని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ మా నాన్న విచారణకు సహకరిస్తారని, ఒక వేళ రాలేని పక్షంలో మా ఇంటికి వచ్చి విచారణ చేసుకోవాలని, అందుకు పూర్తిగా సహకరిస్తామని ఆమె చెప్పారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: