సంక్షోభంలో ఐటీసెజ్ లు ?

Durga
             రాష్ట్రంలో ఐటీసెజ్ లు ఏర్పాటు చేయటం ద్వారా నిరుద్యోగసమస్యలను కొంతమేరకు పరిష్కరించవచ్చన్న ప్రభుత్వ పాచిక పారలేదు. అనుకున్న స్థాయిలో కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవటంతో ఈ ఐటీసెజ్ లు నామమాత్రంగా మిగిలాయి.  ఈ ఐటీ సెజ్లో నిరుద్యోగ సమస్య తీరుతుంటే ప్రవాసాంధ్రులు తిరిగి స్వదేశాలకు వచ్చి పెట్టుబడులు పెడతారని ప్రభుత్వం భావిస్తుంది. ఇది కూడా కలలో మాట అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో 119 సెజ్లు ఏర్పాటు చేశారు. వీటిలో 56 ఐటీ సెజ్లకు ప్రభుత్వం అనుమతి లభించింది. వీటిలోనూ 21 ఐటీ సెజ్లు మాత్రమే పని చేస్తున్నాయి. నాలుగు కంపీనీలు సెజ్లు ప్రారంభించి నష్టాలపాలై దివాళా దశకు చేరుకున్నాయి. ఈ మొత్తం ఐటీ సెజ్ల్లో కనీసం 3,97,433 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశారు. కానీ, వాస్తవానికి 78,380 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు.      ఈ ఐటీసెజ్ల్లో రూ.14,995 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనలు సిద్దమైతే విడుదలైంది మాత్రం 6,809,93 కోట్ల రూపాయలు మాత్రమే మొత్తం సెజ్ల ద్వారా 4,10,185 మందికి ప్రత్యేక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి లభిస్తుందని లెక్కించారు. కానీ, 17,034 మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు.  ప్రస్తుతం ఈ సెజ్లో ఎన్ఎస్ఎల్ ఇన్ఫఫ్రా, సిఎంసి, దివ్యశ్రీ, డిఎల్ఎఫ్ కమర్షియల్ డెవలపర్స్ , ఇన్ఫోసిస్, ఫోనిక్స్, సత్యం, విప్రో, కాకినాడ సెజ్ లో జిఎంఆర్, వంటి కంపెనీలు భాగస్వామ్యం వహిస్తున్నాయి. తిరుపతి, విశాఖ, వరంగల్ లో ఐటీ పరంగా కీలకమైన టవర్ల నిర్మాణం కోసం ఎపీఐఐసీ ఆసక్తివ్యక్తికరణ నోటీసు విడుదల చేస్తే ఇప్పటి వరకూ ఎటువంటి స్పందన రాలేదు.         ఈ టవర్లు నిర్మించకపోతే పలకంపెనీలు నష్టాన్ని భరించలేమంటూ తమ సంస్థలను వెనక్కి తీసుకునే అవకాశాలూ ఉన్నాయి. ఒకవైపు ఇన్ఫాస్ట్రక్చర్, మరోవైపు నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్న ఈ ఐటీ సెజ్లపై ప్రభుత్వం ఒక్కసారి పునారాలోచించి సరైనచర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: