పవన్ మరోసారి గర్జించనున్నాడా..!

Edari Rama Krishna
పవన్  గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే..అయితే ఈ మద్య ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా గురించి భారీ ఎత్తున్న ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో రీసెంట్ గా పవన్ కళ్యాన్ ని మీడియా ప్రశ్నించగా నేను రాజకీయ హోదాలో లేని వ్యక్తిని మనకు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ తరుపు నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు.  అధికార పార్టీ కల్పించుకోని అడగాల్సిన బాధ్యత ఉంది..అదీ కాకుండా తానుఎలా జోక్యం చేసుకోగలనని ఒక సామాన్య వ్యక్తిగా నాకు కొంత ఆలోచన ఉంది..దీని గురించి ఏదైనా చేయాలనే ఆలోచన ఉంది..అంటు వెళ్లిపోయారు. క‌ర్ణాట‌క‌లో మ‌రో హీరో అభిమాని చేతిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్ వినోద్ రాయల్ హ‌త్య‌కు గురి కావ‌డం ఇప్పుడు సెన్సెష‌న‌ల్ న్యూస్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు జాతీయ మీడియాలోనూ ఇప్పుడు ఇదే చ‌ర్చ‌.

తిరుపతిలోని వినోద్ రాయ‌ల్ కుటుంబాన్నిప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌క్తిగ‌తంగా క‌లిసి వారిని ఓదార్చ‌డంతో ఈ ఇష్యూకు మ‌రింత ప్రాధాన్య‌త వ‌చ్చింది.  ప్రస్తుతం పవన్ తిరుపతిలోనే ఎవరినీ కలవకుండా గెస్ట్ హౌస్ కే పరిమితం అయ్యారు.  తిరుపతి ఇందిరా మైదానంలో రేపు భారీ బహిరంగ సభ.  ఈ సభలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఆయన రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల పైన స్పందించే అవకాశముందని తెలుస్తోంది. హఠాత్తుగా పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం.

ఇది చర్చనీయంగా మారింది. జనసేన పార్టీ ప్రస్థానం పేరిట శనివారం నాడు సభ జరగనుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాష్ట్ర్లంలోని సమస్యల పైన చంద్రబాబును ఎంత వరకు ప్రశ్నిస్తారు, అలాగే కేంద్రం ఇచ్చిన హామీల పైన ప్రధాని మోడీని ఏ మేరకు నిలదీస్తారనే చర్చ సాగుతోంది. రేపటి నుంచి జనసేన ప్రస్థానం.. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న జనసేన రేపటి నుంచి క్రియాశీలకంగా మారే అవకాశం..రేపు తిరుపతిలో జనసేన మొదటి బహిరంగ సభ.  రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించనున్న పవన్.

ఇక  శనివారం నాడు నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ సభకు జనసేన తిరుపతి నగర పాలక సంస్థ అనుమతి కోరింది. రేపు మధ్యాహ్నం తిరుపతిలో పవన్ బహిరంగ సభ నిర్వహిస్తారని పార్టీ కోశాధికారి రాఘవయ్య చెప్పారు. అభిమానులకు, జనసేన కార్యకర్తలకు పవన్ దిశానిర్దేశనం చేస్తారన్నారు. అజెండాపై వివరాలు వెల్లడిస్తామన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: