ఎటువైపు:‘ఆ ముగ్గురు’

 హైదరాబాద్: కేంద్రంలోని యూపీఏ సర్కార్ రాష్ర్టపతి ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఆ దిశగా ఆయా రాష్ర్టాల పార్టీల ప్రతినిధులకు, ముఖ్యమంత్రులకు ఆదేశాలను జారీ చేసింది. దీనిలో భాగంగానే బుధవారం నాడు హైదరాబాద్ లో ఎమ్మెల్యేలకు రాష్ర్టపతి ఎన్నికల మాక్ పోలింగ్ నిర్వహాణకు అన్ని ఏర్పాట్లను చేసింది. ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ పేరిట పీసీసీ శాసనసభా పక్షం సమావేశాన్ని, లంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయితే, రాష్ర్టపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన తీరు, ఓట్లు ఎలా వేయాలనే దానిపై పీపీసీ చీఫ్ బొత్స, పార్టీకి చెందిన చీఫ్ విప్లు, విప్ల్లు ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన దానిపై ఈ కార్యక్రమంలో వివరించే అవకాశాలున్నాయి. అయితే, రాష్ర్టపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన దానిపై కాంగ్రెస్ శాసనసభా పక్షం ఏర్పాటు చేసినప్పటికీ ఆయా సభ్యులు ఎవరికి ఓట్లు వేస్తారనే దానిపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, సుజన రంగారావు ఓట్లు ఎవరికి వేస్తారనే దానిపై అందరూ చర్చించుకుంటున్నారు. వీరు ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. అయితే, ముగ్గురు ఇటీవలి కాలంలో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ను కలిశారు. వీరిలో నాని, రంగారావు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తూ స్పీకర్ నాదేండ్లకు రాజీనామా లేఖను అందచేశారు. ముగ్గురు ఎమ్మల్యేలు జగన్ను కలిసినా ఇద్దరు మాత్రమే స్పీకర్ కు రాజీనామాల లేఖల్ని అందచేశారు. పీసీసీ మాత్రం ముగ్గురి విషయంలో ఒకే విధమైన వైఖరిని అవలంబిస్తోంది. తాజాగా రాష్ర్టపతి ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని బుధవారం నాడు నగరంలోని జూబ్లిహాల్ లో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులందరికీ జూబ్లిహాల్ కు రావల్సిందిగా ఆహ్వానం పలికినట్లు సమాచారం. కానీ, ఆళ్ల నాని, చంద్రశేఖర్ రెడ్డి, రంగారావుకు మాత్రం సమాచారం అందించలేదని తెలుస్తోంది. ఆ ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు పీసీసీ ఒక నిర్ణయానికి వచ్చిన ద్రుష్ట్యా కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశానికి ఆహ్వానం పలకలేదనీ తెలుస్తోంది. అయితే, ఆ ముగ్గురు శాసనసభ్యులు వైఎస్ఆర్ పార్టీ ఆదేశాలనుగుణంగానే యూపీఏ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి ఓట్లు వేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ర్టపతి ఎన్నికలను యూపీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ముగ్గురు శాసనసభ్యులకు మాత్రుం ఆహ్వానం పంపించలేదు. అయినప్పటికీ ఆ ముగ్గురు ప్రణబ్ కు ఓటు వేస్తారని సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: