హైదరాబాద్: స్వర్గీయ ఎన్టీఆర్ గురించి, టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురందేశ్వరీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నాయకత్వం మార్పు, చంద్రబాబు గురించి పురందేశ్వరీ మాట్లాడటాన్ని తెలుగుతమ్ముళ్లు తప్పుబడుతున్నారు. నాటి వైస్రాయ్ హోటల్ క్యాంపు రాజకీయాల్లో పురందేశ్వరీ ఆమె భర్త వెంకటేశ్వర్ రావు క్రీయాశీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలుసుననీ తమ్ముళ్లు గుర్తు తెస్తున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ నుంచి ఎన్టీఆర్ను గెంటివేశారనీ, తాను మరో పార్టీ పెట్టుకున్నాడనీ ఆయన పార్టీ గుర్తు సింహాం గుర్తంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న టీడీపీకి ఎన్టీఆర్కు సంబంధం లేదనే అర్థం వచ్చే విధంగా పురందేశ్వరీ మాట్లాడారు. అంతటితో ఆగకుండా స్వర్గీయ ఎన్టీఆర్ను పార్టీ నుంచి గెంటివేశారనీ, అలాంటి నాయకులకు ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హత కూడా లేదంటున్నారు. ఈ విషయంలో పురందేశ్వరీకి కూడా లేదనీ మనం చెప్పాలి. ఒక వేలు ఎదుటి వారికి చూపిస్తే నాలుగేళ్లు మనల్ని సూచిస్తాయి. సరిగ్గా పురందేశ్వరీ కూడా ఇదే వర్తిస్తోంది. 17ఏళ్ల నాటి విషయాలు ఇప్పుడు ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పురందేశ్వరీ మాటలకు తెలుగుతమ్ముళ్లు కూడా కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. నాడు ఎన్టీఆర్ ను అధికారం నుంచి దించడంలో అటు చంద్రబాబు ఎంతగా ప్రయత్నించారో పురందేశ్వరీ కుటుంబం అంతగానే పనిచేసింది. లక్ష్మీపార్వతిని అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్ను బలవంతంగా సీఎం సీటు నుంచి దించడంలో నందమూరి కుటుంబం, నారావారి కుటుంబం, దగ్గుబాటి కుంటుంబాకు చెందిన అందరూ పాలుపంచుకున్న వారే. కానీ, ఇప్పుడు పురందేశ్వరీ మాత్రం కేవలం చంద్రబాబు ఒక్కడే ఎన్టీఆర్ను సీఎం సీటు నుంచి దించారనేది ముమ్మాటికీ తప్పేవుతోంది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ నుంచి గెంటివేయడంలో అందరూ భాగస్వాములే. దీంట్లో ఎవరూ మినహాయింపు కాదు. ఇదే విషయాన్ని తెలుగుతమ్ముళ్లు గ్రహించడం మంచిది. ఏది ఏమైనా ఎన్టీఆర్ విషయంలో చేసిందంతా చేసి ఇప్పుడు తానేమీ తప్పు చేయలేదంటే చరిత్ర క్షమించదు.
మరింత సమాచారం తెలుసుకోండి: