బాగా...ముందుచూపుతో బాబు పన్నిన వ్యూహం పనిచేయడం మొదలుపెట్టింది.వ్యూహం అమలయ్యాక ఫలితం ఎలా ఉంటుందో తెలియదు కాని అందరి చూపు ఎన్టీఆర్ కుటంబసభ్యుల వ్యవహారశైలి పై పడింది. టీడీపిలో జరుగుతున్న తాజా పరిణామాలలో భాగంగా బాలకృష్ణ గొంతు భారినిర్ణయాన్ని ప్రకటించింది. ఏంచేస్తే పలితం ఎలా వస్తుంది అన్నది ఊహించడంలో చంద్రబాబునాయుడు దిట్ట అని నిరూపించుకోవడంతో పాటు పార్టీలో తన ఆధిపత్యానికి ఢోకా ఉండకూడదన్న ఆలోచనతో ఆయన ఎన్టీఆర్ కుటుంబంలో తన వ్యూహం అమలు చేసారని అందరు భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో బాలకృష్ణ చేసిన వాఖ్యలు దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. కొడాలినాని చేసిన ఘాటు వాఖ్యలతో జూనియర్ ఎన్టీఆర్,ఆయన తండ్రి హరికృష్ణకు పార్టీలో చోటులేకుండా చేస్తున్నారన్న అంశం తెరపైకి వచ్చింది. ఈవిషయాన్ని స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ఖండించినప్పటికి ఈవిషయంలో హరికృష్ణ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.దీంతో ఇందులో నిజముండవచ్చని అనుమానాలు బలపడుతున్న వేల బాలకృష్ణ తన రాజకీయరంగ ప్రవేశాన్ని నిర్దారించడం సంచలనాన్ని సృష్టించింది. తాను కార్యకర్తగానే ఉంటానని చెపుతూ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ పదవి విషయంలో గట్టిగా విభేదించలేదు.2014 ఎన్నికల్లో సిం.ఎం. అభ్యర్థి చంద్రబాబేనని నొక్కి వక్కానించడం వెనుక కూడా చంద్రబాబు అమలుచేసిన వ్యూహమే పనిచేసిందని చెప్పుకుంటున్నారు.2009లో అధికారం కోసం అన్వేషించిన అన్నిమార్గాలు అంతగా పనిచేసేలా లేకపోవడంతో మామ ఎన్టీఆర్ పోలికలు,అదే వాగ్ధాటి,అంతకు మించి సినీ హీరోగా ఉన్న క్రేజి తనకు బాగా ఉపయోగపడుతాయని జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దించారు. అయితే అది చంద్రబాబు కన్నా జూనియర్ ఎన్టీఆర్ కు లాభం చేసింది. టీడీపిలో కూడా ఆయనకు క్రేజి తెచ్చిపెట్టింది. ఇటు జనంలోను జూనియర్ ఎన్టీఆర్ కు గుర్తింపును తేవడం చంద్రబాబుకు కొంత ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టాయి.దీంతో ఉపశమన చర్యల్లో భాగంగానే తన సోదరికూతురుతో సంబందం కలిపారని కూడా గుసగుసలు గుప్పుమన్నాయి. ఇది కూడా బెడసి కొడితే ఎలా అన్నఆలోచనలో భాగంగానే తన కుమారుడు లోకేశ్ తో బాలకృష్ణ కూతురుకు పెళ్లి చేసి ఎన్టీఆర్ కుటంబంలో మరోబలమైన మద్దతు ఆయన వైపు ఉండేలా చూసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. హరికృష్ణ వైపు నుంచి రాజకీయంగా ప్రమాదం ఎదురైతే బాలకృష్ణ ఆయుధం పనిచేసి పని సాఫీగా ముగుస్తుందన్న మాట. ఇవన్నీ నిజాలు అయినా....కాక పోయినా....తాజా పరిణామాలు మాత్రం నిజమనే వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: