ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతోందో వాడే ... పండుగాడు అనే డైలాగ్ మహేష్ బాబుతో పోకిరి సినిమాలో పూరీజగన్నాథ్ చెప్పించినా ప్రస్తుత రాజకీయాలలోకి ఇదే స్టయిల్ మెయింటిన్ చేస్తున్నారు. వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్ తనకంటూ వ్యక్తిగత ఇమేజ్ లేదు, తండ్రినుండి వచ్చిన ప్రజకర్షక పథకాలను వారసత్వ ఓట్లుగా మార్చుకోవడమే తప్ప, తనేం పెద్ద వక్తకాదు. రాజకీయ అనుభవశాలి అంతకన్నాకాదు. తన బలం కన్నా ప్రత్యర్థుల బలహీనతలే ఆయన ఆయుధంగా వాడుకుంటున్నారు. మొన్నజరిగిన ఉప ఎన్నికల్లో 18 సీట్లలో 15 సీట్లు గెలుచుకొని, తెలంగాణలో నువ్వానేనా అనే పోటీనిచ్చిన జగన్ పార్టీ, అత్యధిక మెజార్టీటీతో పార్లమెంట్ స్థానాన్ని సంపాధించుకొని 10జనపథ్ రోడ్డులోని దేశానికి కాబోయే ప్రిన్స్ కి నిద్రలేకుండా చేశారు. ఎప్పుడూ ఆంద్ర్రప్రదేశ్ నుండి ఎవ్వరూ వెళ్లినా బిజీగా ఉన్నామంటూ నెలలు తరబడి తిప్పే రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, చిదంబరం, మొదలైన వాళ్లంతా ఇప్పుడు ఎవ్వరు ఎప్పుడెళ్లినా,ఒక్కరుగా అయినా సరే, గుంపుగా అయినా సరే రండి అంటూ ఆహ్వానం పలుకుతున్నారు. ఆరోడ్డులో ఎవరైనా ఎపీ నుండి వచ్చినట్లనిపించినా పలకరిస్తున్నారు. అలా అయిపోయింది వారి పరిస్ఠి. మంతనాలు, రిపోర్టులు, సర్వేలతో కుస్తీ పడుతున్నారు. ఇదే గాలి 2014 లో కూడా వీస్తే పరిస్థితి ఎంటా అని నిద్రలేకుండా గడిపే పరిస్థితి ఢిల్లీ పెద్దలకు పట్టింది. రాష్ట్రంలో ప్రధాన పతిపక్షమైన తెలుగుదేశం పార్టీని కూడా కోలుకోలేని దెబ్బ తీసాడు జగన్, అసలే మొన్న జరిగిన ఉపఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటికూడా అసెంబ్లీ స్థానాలను గెలుచుకోలేకపోయామన్న బాధలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. గోరు చుట్టుపై రోకటి పోటులాగా ఆపరేషన్ ఆకర్షన్ ఆకర్ష పేరుతో తెలుగుదేశం పార్టీలోని నాయకుల్నందర్నీ వైసీసీ పార్టీలోకి లాగే ప్ర్రక్రీయ కనసాగిస్తున్నారు. జగన్, తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు, కుటుంబపోరుతో సతమతమవుతున్న చంద్రబాబునాయుడికి ఈ వ్యవహారం మూలిగే నక్కపై తాటికాయపడినట్లు అయింది. తెలుగుదేశం పార్టీకి సెంటుమెంటు స్థానమైన గుడివాడ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ ఫిరాయించడంతో తెలుగుదేశంలో గగ్గోలు మొదలైంది. పార్టీ నిర్లక్ష్యంచేస్తుందని, తన జూనియర్ యన్టీఆర్ ద్వారా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందువల్లే చంద్రబాబునాయుడు ప్రక్కన పెడుతున్నారని, యస్సీ, బీసీల ఓట్లు వైసీపీకీ ఉన్నాయి కాబట్టి వైసీపీ లోకెళుతున్నానని నాని ఎన్ని మాటలు చెప్పినా ఒక్కటి మాత్రం నిజం గెలుపుగుర్రాన్ని ఎవరు ఒదులుకుంటారు. ప్రస్తుతానికి ప్రజాకర్షక పార్టీలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఇంతే, తెలుగుదేశం నుండే ఎక్కువ వలసలు జరిగాయి. తెలుగుదేశం పార్టీలో ఇక్కడితో నాయకులు జంప్‌లు ఆగిపోవని అధిష్టానానికి తెలుసు, అందుకే అంత రభస, కృష్ణాజిల్లాలో ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ వీడటానికి సిద్దంగా ఉన్నారనే విషయమే నాయకులను కలవర పరుస్తోంది. గుంటూరు, ప్రకాషం జిల్లాలో కూడా పరిస్థితి ఇందుకు విరుద్దంగా ఏమీ లేదని నాయకులకు ఉప్పందుతుండటంతో తెలుగుదేశం పార్టీలకు చెందిన శాసన సభ్యులు జగన్ పంచన చేరడానికి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. దాంతో చంద్రబాబుని పరామర్శించడానికి బాలకృష్ణ పని కట్టుకొని వచ్చి పరిస్థితిని పరీక్షించవలసి వచ్చింది. అసలే రెండుకళ్ళ సిద్దాంతంతో తెలంగాణకు దూరం అయిన చంద్రబాబుకు ఆంద్రలో కూడా ఓట్లు పదవి పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. కాంగ్రెస్ పరిస్థితి అంతే ఏదో అధికారంలో ఉననారు కాబట్టి నాయకులు సైలెంట్‌గా ఉన్నారు. రాబోయే ఎన్నికలకు ఎలాగా అనీ ముందుచూపున్న వారంతా వాళ్ల పిల్లల్పి వైసీపీకి పంపుతున్నారు. దానికి తార్కాణం తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి కుమార్తే వైసీపీలో చేరారు. రాజమండ్రికి చెందిన మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడిది అదేతీరు, కాంగ్రెస్ నాయకుడు దివంగత జనార్థన్ రెడ్డి (పీజేఆర్) కుమార్తె విజయకూడా చెంచల్ గూడా జైలులో జగన్ కలిసిన కలిసారు. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో అంతగా వలసలు లేకపోయినా వచ్చే ఎన్నికలనాటికి తీవ్రత హెచ్చయ్యే ప్రమాదం లేకాపోలేదు, మునిగిపోయే ఓటి పడవల్లో ఉండటానికి ఎవరూ ఇష్టంపడటం లేదు. ఒక్కడంటే అదీ చెంచల్గూడా జైల్లో నుంచి మహామహానాకుల్ని మట్టికరిపిస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: