గల్ఫ్ బాధితులను ఆదుకుంటా: బాబు హామీ

Kuthuru Raji Reddy
తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గల్ఫ్ బాధితులను ఆదుకుంటామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హామీనిచ్చారు. బుధవారం కరీంనగర్ జిల్లా జగిత్యాల నియోజకవర్గంలో నాల్గవరోజు పాదయాత్రకు ప్రజలనుండి మంచి స్పందన వచ్చింది. నేటికి బాబుయాత్ర 75వరోజుకు చేరుకుంది. కరీంనగర్ జిల్లాలో ప్రజలనుండి వస్తున్న స్పందన చూసి బాబు మరింత దైర్యంగా మాట్లాడుతున్నారు. మహిళలు మంగళహారతులు పట్టారు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. పాదయాత్ర సందర్బంగా అనేకమంది గల్ఫ్ బాధితులు తమ గోడును చెప్పుకోగా టిడిపి అధికారంలో రాగానే గల్ఫ్ బాధితులకోసం ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. గొల్లకుర్మల సమస్యల సాధనకోసం కృషిచేస్తానని తెలిపారు. పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఒక్కరోజు టిడిపి ఆధ్వర్యంలో దీక్ష చేస్తామని టిడిపి అధినేత చంద్రబాబు ప్రకటించారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ పత్తిని పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేకపోవడంతో వారు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కొంతమంది బాబు దృష్టికి తీసుకురావడంతో స్పందించిన చంద్రబాబు గిట్టుబాటు ధరకోసం, సమస్యల పరిష్కారం కోసం జమ్మికుంటలో ఒక్కరోజు దీక్షచేస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: