అర్ధరాత్రి ఆడపడుచూ ఒంటిరిగా తిరిగిననాడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లుగా గుర్తించాలని గాంధీ మహత్ముడు అన్నటువంటి మాటలు వింటుంటే నేటికి దేశానికి నిజమైనా స్వాతంత్ర్యం రాలేదని భావించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్య దేశమని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి భారత దేశ రాజదానిలోనే మహిళకు అందరి ముందే గ్యాంగ్ రేప్ జరిగితే ఇంతకంటే అవమానం ఏముంటుంది.
దేశరాజదాని ఢిల్లీలో ఒక యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే మహిళగా ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్నటువంటి షీలాధీక్షిత్ శాంతిభధ్రతల సమస్య తన చేతుల్లో లేదని వ్యాఖ్యానించారంటే ప్రజాస్వామ్యం ఏవిధంగా ఆపహాస్యం అవుతుందో స్పష్టం అవుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడారంటే ఇంతకంటే దురదృష్టం మరొకటి ఉండదు. దేశరాజదాని ఢిల్లీలో ఇటువంటి సంఘటనలు జరిగిన ఇప్పటివరకు ఇటువంటి సంఘటనలు ఆపలేకపోయారు. కాగా ఇటువంటి సంఘటన మరో మారు జరిగిపోయిన తర్వాత భవిష్యత్తులో జరుగకుండా చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి మాట్లాడడం బాధకరం.
నడుస్తున్న బస్సులోనే ఉత్తరాఖండ్ కు చెందిన ఓపారా మెడికోపై నలుగురు ఆగంతకులు సామూహీక అత్యాచారం జరిపారు. సంఘటనను అడ్డుకోబోయిన ఆమె స్నేహితుడిని ఇనుపరాడ్లతో గాయపరిచి బస్సులోంచి కిందకు తోసేశారు. గాయాలకు గురైన వీరిద్దరిని ఆసుపత్రికి తరలించగా అత్యాచారానికి గురైన యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి తరలించారు.
మరింత సమాచారం తెలుసుకోండి: