స్థానిక సమరానికి సై అంటూ ప్రభుత్వం సిద్దమవుతుండడంతో ఛోటా నేతల్లో బడా సందడి మొదలయింది. ఇప్పటికి ఎన్నోసార్లు ఇలా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం ఏదో కారణంతో వాయిదా వేస్తూ వస్తుండడంతో ఈసారి కూడా వారి మనస్సుల్లో చిన్న అలజడి మాత్రం నెలకొంది. పల్లె నుంచి పట్నం దాకా గల్లీ లీడర్ నుంచి ద్వితీయశ్రేణి నాయకుల వరకు గత రెండేళ్లుగా కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు ఈఎన్నికల కోసం. లీడర్లకు పదవులు తెచ్చిపెట్టేవే కాకుండా వీది నుంచి నగరం దాక అభివృద్దికి బాటలు పడాలన్నా ఈఎన్నికలు జరగాలి ఆయాప్రాంతాల బాగోగులు చూసేందుకు స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధులు రావాలి. అందుకే వీటికోసం నేతలే కాదు ప్రజలు కూడా ఎదిరిచూస్తున్నారు. వీధిలోని మురికిగుంత,నీరునిచ్చే బోరుబావి,వెలుగునిచ్చే వీధిదీపం ఇలా ఎన్నో సమస్యగా మారితే ఎవరికి చెప్పాలి,ఈసమస్యను ఎవరు పరిష్కరించాలి. సర్పంచ్ లేకపాయే,ఎమ్మెల్యే కనిపించడాయే...ఇలా ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయి సమస్యలు పేరుకుపోయి,అబివృద్ది పనులు క్షేత్రస్థాయిలో నిలచిపోయి రాష్ట్రం చెత్తాంధ్రప్రదేశ్ గా తయారైందన్న నిజాన్ని ప్రభుత్వపెద్దలే అంగీకరిస్తున్నారు. గ్రామం నుంచి నగరం దాకా వార్డుసభ్యులు,సర్పంచులు,కౌన్సిలర్లు,మున్సిపల్ చైర్మన్లు,కార్పోరేటర్లు,మేయర్లు,ఎంపిటిసిలు,జడ్పీటీసీలు,ఎంపిపిలు ఇలా దగ్గరుండి ప్రజలకోసం పనిచేసేవారు లేకపోవడంతో ప్రజల్లో కూడా ప్రభుత్వంపై ఆగ్రహాన్ని కలిగించింది. ఎమ్మెల్యే,ఎంపీలను గెలిపించేందుకు,చెమటోడ్చి కష్టపడి పదవుల కోసం ఎదిరిచూస్తే వాటిని దక్కకుండా చేయడంతో పార్టీ క్యాడర్ కూడా అధికారపార్టీపై ఆగ్రహాన్ని పెంచింది. ఈపలితమే జరిగిన ఎన్నికల్లో ఘోరపరాభవానికి కారణమని కూడా భావించిన ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ఎట్టకేలకు స్థానిక సమరానికి శంఖారావం పూరించేందుకు సిద్దమయ్యారు. సాధారణ ఎన్నికలకు కూడా ఎక్కువ సమయం లేకపోవడం ఆలోగా పార్టీపట్టును,ప్రభుత్వ ప్రతిష్టను పెంచుకోవాలన్నా ప్రజలతో నేరుగా సంబందం ఉన్న ప్రజాప్రతినిధులుండాలన్న నిజాన్ని గ్రహించి ఇక ఈఎన్నికలు త్వరగా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ప్రత్యేకాధికారుల పాలన మల్లీ పొడగించి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. దీంతో మరో ఆర్నెల్లు సమయం తీసుకుంటారేమోనన్న శంఖ కూడా లేనివారు లేకపోలేదు. మొత్తం మీద స్థానికపోరులో సత్తా చాటేందుకు అన్నిపార్టీల నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.టికెట్లు దక్కించుకునేందుకు పైరవీలు ప్రారంభించారు....దీంతో క్షేత్రస్థాయిలో రాజకీయసందడి మొదలైంది.
మరింత సమాచారం తెలుసుకోండి: