దేశవ్యాప్తంగా ఎక్జైటింగ్ - ఎగ్జిట్ పోల్స్: కలగూరగంపకు అవకాశం రాదేమో!
సార్వత్రిక ఎన్నికల్లో మోడీ వ్యతిరేఖపక్షాల ఆశలు గల్లంతుచేసేలా ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎక్జైటింగ్ పోల్స్గా వెల్లడయ్యాయి. గతంతో పోల్చుకుంటే బీజేపీకి మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు అర్ధమౌతుంది. “మేజిక్ ఫిగర్ దాటి” 15 స్థానాల వరకు ఎన్డీఏ గెలుచుకుంటుందని స్పష్టం చేసింది.
ఇకపోతే యూపీఏ 126స్థానాలలోపే విజయం సాధిస్తోందని తెలిపాయి. ఇకపోతే ఇతరులు, ప్రాంతీయపార్టీల ప్రభంజనం మాత్రం కనిపిస్తుంది. 130 పైగా స్థానాల్లో ఇతరులు గెలుస్తారని జాతీయ మీడియా చానెల్స్ స్పష్టంచేశాయి. అత్యధిక స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెల కొంది. ఇకపోతే విపక్షాల్లో నైరాశ్యం నెలకొంది.
అయితే ఈ ఫలితాలు ఎంతమేరకు వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటాయో? తెలియాలంటే మే 23 వరకు నిరీక్షించాల్సిందే. ఈ ఎన్నికలపై ప్రజల్లో ఉత్కంఠ నెల కొన్న నేపథ్యంలో దేశంలోని ప్రసిద్ధ సర్వే సంస్థలు ప్రజా నాడిపై తమ అంచనాలతో కూడిన సర్వేలను బయట పెట్టాయి. తమిళనాడులోని వేలూరు లోక్‌సభ స్థానం మినహా 542 లోక్‌సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణా చల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు ఏడు దశల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజల నాడి ఎటువైపు ఉందో తెలుసు కోవడానికి ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయా సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌లో ఏ పార్టీకి ఎన్ని
సీట్లు వచ్చాయో చూద్దాం.
సర్వే సంస్థ | భాజపా | కాంగ్రెస్ | ఇతరులు |
టైమ్స్ నౌ-వీఎంఆర్ | 306 | 132 | 104 |
ఎబీపీ న్యూస్ | 267 | 127 | 148 |
న్యూస్ నేషన్ | 282-290 | 118-126 | 130-138 |
వీడీపీఏ | 333 | 115 | 94 |
రిపబ్లిక్ టీవీ | 287 | 128 | 127 |
రిపబ్లిక్ టీవీ -జన్ కీ బాత్ | 295-315 | 122-125 | 102-125 |
రిపబ్లిక్ టీవీ - సీ- ఓటర్ | 287 | 128 | 127 |
ఎన్డీటీవీ | 302 | 127 | 133 |
టైమ్స్ ఆఫ్ ఇండియా | 306 | 152 | 84 |
ఇండియా టీవీ | 300 | 148 | 94 |
న్యూస్ 18 నెట్‌వర్క్ | 336 | 82 | 124 |
న్యూస్ ఎక్స్-నేత | 242 | 165 | 136 |
ఇండియా టుడే | 232-251 | 73-99 | 56-74 |
సీఎన్ఎన్-ఐబీఎన్ | 336 | 82 | 124 |
టుడేస్ చాణక్య | 340 | 70 | 132 |