గత కొద్దిరోజులుగా కేసీఆర్ కుమార్తె కవిత కాంగ్రెస్ లోకి వెళ్తుంది అనే ప్రచారం జోరుగా వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అంతేకాకుండా ఆ మధ్యకాలంలో తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కవిత కాంగ్రెస్ లోకి వస్తానని చెప్పిందని, కానీ నేనే ఆమెను మా పార్టీలోకి ఆహ్వానించలేదు అంటూ తెలిపారు. అయితే తాజాగా కాంగ్రెస్ లోకి కవిత వెళుతుందనే ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది.తాజాగా కవిత మాట్లాడుతూ.. నేను కాంగ్రెస్ లోకి వెళ్తానని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వద్దన్నట్టు మాట్లాడుతున్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు చేసి నా వ్యక్తిత్వం పై మచ్చ వేయకండి.నేను ఇప్పుడు చెబుతున్నాను ఓడిపోయే లూజింగ్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ లో నేను అస్సలు చేరను.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది.వచ్చే ఎన్నికల్లో గెలిచేది జాగృతి పార్టీనే.జాగృతి పార్టీ ద్వారా తెలంగాణ రాజకీయాల్లో శక్తిగా ఎదుగుతాను. అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఆ ఓడిపోయే పార్టీలో ఉండడం కంటే నా పార్టీలోకి వస్తే ఆయనకు మంచి గౌరవప్రదమైన హోదా ఇస్తానని ఇప్పుడే అందరి ముందు తెలుపుతున్నాను. అనవసరంగా నా పేరుని చెడగొట్టకండి.మహేష్ కుమార్ గౌడ్ గారికి ఉన్న అనుభవానికి తగ్గట్టుగా మా పార్టీలోకి వస్తే ఆయనకు నేషనల్ కన్వీనర్ పోస్ట్ ఇస్తాను.
నాపై ఇప్పటినుండి దుష్ప్రచారాలు మానుకోండి.నేను చాలా సీరియస్ పొలిటికల్ పార్టీగా ఎదుగుతున్నాను. నా పేరుని బద్నాం చేయకండి. అయితే నేను కాంగ్రెస్ లోకి వస్తానని మిమ్మల్ని బతిమిలాడినట్టు చెప్పారు. బహుశా అవి మీ కలలో జరిగినట్టు ఉన్నాయి. కలలో జరిగిన విషయాలను బయట చెప్పారు. ఇప్పటికే మా పార్టీకి సంబంధించి విధివిధానాలు తయారవుతున్నాయి. త్వరలోనే ఒక ముందడుగు వేస్తాం. మేము ఎవరి కోసం వెయిట్ చేయడం లేదు అంటూ కవిత సంచలన వ్యాఖ్యలు చేసింది.