బెంగాల్లో బాబ్రీ తరహా మసీదు.. వాళ్లని రెచ్చకొట్టడానికేనా..?
ఈ చర్య వల్ల రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడి పెరిగిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో ఏ విధమైన వివాదాలు తలెత్తకుండా ఆ ప్రాంతంతో పాటు సమీప గ్రామాల్లో కూడా పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరించారు. తాను తీసుకున్న నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని, మసీదును నిర్మించడంలో తన సంకల్పం దృఢంగా ఉందని కబీర్ స్పష్టంచేశారు.“నా నిర్ణయం రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు. ప్రార్థనా స్థలాన్ని నిర్మించడం ప్రతి భారతీయుడి రాజ్యాంగ హక్కు. బాబ్రీ మసీదు నమూనాను అనుసరించి ఇక్కడ ఒక గొప్ప మసీదును నిర్మిస్తాను” అని ఆయన ప్రకటించారు.
మసీదు నిర్మాణానికి కావాల్సిన నిధుల విషయానికి వస్తే—పేరు వెల్లడించనందుకు ఇష్టపడని ఒక పారిశ్రామికవేత్త రూ. 80 కోట్లు విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారని హుమయూన్ కబీర్ తెలిపారు. అందువల్ల నిర్మాణ పనుల్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశం లేదని కూడా వివరించారు. అంతేకాక మసీదు ప్రాంగణంలో ఒక ఆధునిక ఆసుపత్రి, వైద్య కళాశాల, విశ్వవిద్యాలయం, హోటల్, హెలిపాడ్ వంటి వసతులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తం ప్రాజెక్టుకు సుమారు రూ.300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా బెల్డంగాలో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక, విద్యా, వైద్య కేంద్రం ఏర్పడే అవకాశముందని భావిస్తున్నారు. అయితే దీని పై కొంతమ్మది నెగిటివ్ కూడా మాట్లాడుతున్నారు. అసలు ఇప్పుడు ఇది అనవసరం అని మత వుద్వేషాలు రెచ్చకొట్టడానికే ఈ విధంగా చేశారు అంటూ మండిపడుతున్నారు..!