మోడీ దెబ్బకు ట్రంప్ విలవిల.. సెకండ్ కో షాక్ ఇస్తూ చుక్కలు చూపిస్తున్నాడు గా.?

Pandrala Sravanthi
 ప్రపంచ దేశాల్లో అమెరికా అగ్రరాజ్యమని అందరూ భావిస్తారు.. అంతేకాదు చాలా దేశాలలోని ప్రజలు అమెరికాకు వెళ్లి బ్రతుకుతూ ఉంటారు. అందుకే అమెరికాను అగ్ర రాజ్యమని పిలుస్తూ ఉంటారు.. అలాంటి అగ్రరాజ్య దేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ భయపడిపోతూ వాళ్ళు చెప్పినవన్నీ వింటూ ఉంటారు.. ఆ విధమైనటువంటి అమెరికాకు భారతదేశం ఎప్పుడు భయపడుతూ ఉండేది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే నడుచుకుంటూ ఉండేది.. కానీ మోడీ ప్రధాని అయిన తర్వాత ఈ పరిస్థితులు మారిపోయాయి. అమెరికా దేశాన్ని కూడా తలదన్నే విధంగా మోడీ తయారయ్యారు.. అంతేకాదు అమెరికా అధ్యక్షుని మాటను కూడా పట్టించుకోకుండా మన దేశ అభివృద్ధి కోసమే పాటుపడుతున్నాడు.. ఒక రకంగా చెప్పాలంటే మోడీ ట్రంప్ కి చుక్కలు చూపిస్తున్నారని చెప్పవచ్చు.. 


అగ్రరాజ్యమని అహంకార భావం నుండి అమెరికాను మోడీ చీపురు పుల్లతో సమానంగా తీసివేస్తున్నారు. అయితే ఈ కొన్ని విషయాల్లో మోడీ ధైర్యాన్ని దేశమంతా ప్రశంసిస్తున్నారు.. ఆ విషయాలు ఏంటో చూద్దాం.. అమెరికా ఏం చెప్పినా సరే వింటూ అమలు చేసే బానిసత్వం ఇంతకుముందు ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయి మోడీ ఆ విధానానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా అమెరికా మనపైన సుంకాలు వేసి మనల్ని బెదిరించాలని చూసింది. కానీ ఆ బెదిరింపులకు భయపడకుండా రష్యాతో బంధం ఏర్పరచుకొని  అమెరికాకు చుక్కలు చూపించింది. అంతేకాదు అమెరికాకు పంపించే వస్తువులను 10 దేశాలకు పంపించుకుని మోడీ సత్తా చాటుతున్నారు. అంతేకాకుండా ట్రంప్ కలుద్దామని మోడీకి ఆరుసార్లు కబురు పెట్టినా కానీ మోడీ కనీసం ఆయనను పట్టించుకోలేదు.


అలాగే ట్రంప్ బెదిరింపులకు భయపడకుండా చైనాతో కూర్చొని మాట్లాడి అమెరికాకే చుక్కలు చూపిస్తున్నాడు మోడీ. ట్రంప్ ఆరుసార్లు మోడీని కలవడానికి ప్రయత్నించినా కానీ అవకాశం ఇవ్వకుండా రష్యా అధ్యక్షునికి ఘన స్వాగతం పలికి మరీ కలిసి ట్రంప్ కు చుక్కలు చూపించారు. ఈ విధంగా మోడీ అమెరికా బెదిరింపులకు ఏమాత్రం భయపడకుండా, భారతదేశం అమెరికాపై ఆధారపడి లేదని నిరూపించుకుంటున్నారు.. ఏది ఏమైనప్పటికీ మోడీ భారతదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాలలో అద్భుతమైన స్థానంలో నిలబెడుతున్నారని చెప్పుకోవచ్చు.. అగ్ర రాజ్యాన్ని తలదించుకునేలా చేశారంటే మోడీ పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: