రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఎలా బిహేవ్ చేస్తారనేది చెప్పడం కష్టం.. అధికారం చేపట్టడానికి ఎంతకైనా తెగిస్తారు ఎంత దూరమైనా వెళ్తారు.. అయితే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఆయనను తిట్టి ఆయన చేస్తున్న తప్పులను ఎత్తిచూపి రేవంత్ రెడ్డి ఫేమస్ అయిపోయారు. నిజం చెప్పాలంటే కేసీఆర్ ను ఎక్కువ తిట్టిన వ్యక్తుల్లో రేవంత్ రెడ్డి ముందు స్థానంలో ఉంటారు. అందుకే కేసిఆర్ కి ఏ విధంగా పేరు ఉందో రేవంత్ రెడ్డికి కూడా అంతే పేరు వచ్చింది. అలా ఉదయం లేచిన నుంచి మొదలు కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడడంలో రేవంత్ రెడ్డి దిట్ట అని చెప్పవచ్చు. అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన కేసీఆర్ ను బీఆర్ఎస్ ను తిడుతూ వచ్చారు. ఈ విధంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత కోపం ఉండేదని చెప్పవచ్చు.
అలాంటి రేవంత్ రెడ్డి తాజాగా కేసీఆర్ పై జాలి చూపిస్తూ మాట్లాడడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి చాలా వెరైటీగా మాట్లాడారు. కేసీఆర్ క్రియాశీలక పాలిటిక్స్ లో లేరని, ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఆయనను విమర్శించడం కూడా సరికాదు అన్నట్టు మాట్లాడారు. ఆయన ఎప్పుడైతే క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారో అప్పుడే కేసీఆర్ గురించి మాట్లాడతానని చెప్పుకొచ్చారు.
ఇక కేసీఆర్ పేరు చెడగొట్టి ఆయన కుర్చీ గుంజుకోవాలని కేటీఆర్,హరీష్ రావులు ఎంతగానో ఎదురు చూస్తున్నారని తెలియజేశారు.. మరి వారికి ఎంత టాలెంట్ ఉందో చూడడానికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పూర్తిగా వాళ్లకు వదిలేసాడని కానీ అక్కడ వాళ్ళ టాలెంట్ ఏంటో నిరూపణ అయిందని చెప్పుకొచ్చారు. అధికారం పోయినా కేటీఆర్ హరీష్ రావులకు అహంకారం తగ్గలేదని, ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నవారు ప్రభుత్వానికి కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ రాష్ట్ర డెవలప్మెంట్ కు సహకరించాలన్నారు. అధికారమనేది వారసత్వ సంపద కాదంటూ విమర్శించారు.