తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అంటే ఒక ఎమోషన్.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చాలామంది ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఆ విధంగా కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నాడు అంటే ప్రత్యర్థులకు చెమటలు పడతాయి. అలాంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు ఏకధాటిగా సీఎం పదవిని అధిరోహించారు. రాష్ట్రానికి కూడా అభివృద్ధి చేశారని చెప్పవచ్చు. మూడవసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోయింది. అయితే దీనికి కారణం కేసీఆర్ కాదు ఆయన కింద ఉన్నటువంటి నాయకత్వం. కింద ఉండే చాలామంది నాయకులు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఫీల్ అవ్వడం వల్ల ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ ఓటమి పాలైందో అప్పటి నుంచి కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.
\ఆయన అక్కడ ఉండకుండా ప్రతిపక్ష హోదాలో ఉండి జనాల్లో తిరిగి ఉంటే మాత్రం రాష్ట్రంలో పరిస్థితులు మరో విధంగా మారుతాయని చెప్పవచ్చు. అయితే కంటోన్మెంట్ ఉపఎన్నిక కావచ్చు తాజాగా ఓడిపోయిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు. ఆయన కనీసం ప్రచారానికి రాకపోవడం వల్లే ఓటమిపాలైంది.. అయితే ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఎక్కడ ప్రచారం చేసినా అక్కడ తప్పకుండా గెలుస్తూ వచ్చింది. ముఖ్యంగా నాగార్జునసాగర్, మునుగోడు,హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేశారు.. ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అద్భుత మెజారిటీతో బయటపడింది..
ఇక దుబ్బాక,కంటోన్మెంట్, హుజురాబాద్ వంటి ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారానికి రాలేదు. దీంతో ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది.. అయితే కేసీఆర్ ఇలా కాకుండా బయటకు వచ్చి ప్రచారం చేసి ఉంటే మాత్రం వార్ వన్ సైడ్ అవుతుందని చెప్పవచ్చు. మరి కేసీఆర్ గెలుపును ముందుగానే అంచనా వేసి ప్రచారానికి రాలేదా లేదంటే అవసరం లేదు అని సైలెంట్ గా ఉన్నారా అనేది తెలియదు. అలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి ఆయన ప్రచారానికి రాకుండా కేటీఆర్ కు హరీష్ రావుకు బాధ్యతలు అప్పజెప్పి ఓటమిపాలయ్యారు. దాంతో చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు కేసీఆర్ బిగ్ మిస్టేక్ చేసి కారు గాలి తీసేశారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.