Bihar Election Results 2025 Live: రాఘోపూర్‌లో తేజస్వి యాదవ్ ఆధిక్యం.. సోదరుడు తేజ్ ప్రతాప్‌కు భారీ ఎదురుదెబ్బ..!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు లో మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక ఎన్డీయే కూటమి 70 స్థానాల్లో ముందంజలో ఉండగా, ఎంజీబీ 51 చోట్ల, ఇతరులు 5 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అంతేకాకుండా, ఉదయం 10:00 గంటల సమయానికి PValue డేటా ప్రకారం, రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత తేజస్వి యాదవ్ రాఘోపూర్ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నా..ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నియోజకవర్గంలో మొదటి రౌండ్లలో ఆధిక్యం సాధించినప్పటికీ, తర్వాతి రౌండ్లలో ఆయన వెనుకబడటం గమనార్హం.
అన్నదమ్ములిద్దరూ వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేయడంతో బిహార్ రాజకీయాల్లో ఈ ఎన్నికల పోరు మరింత ఆసక్తికరంగా మారింది. రాబోయే రౌండ్లలో ఫలితాలు ఎలా మారతాయి, చివరకు ఎవరి చేతిలో విజయతీర్థం చేరుతుందన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చాంశంగా మారింది. మరి కొద్ది గంటల్లోనే ఈ బీహార్ ని ఎవరు ఏలబోతున్నారో తేలిపోబోతుంది. చాలా అమంది మళ్లీ ఎన్డీయే అధికారం చేపట్టబోతుంది అంటున్నారు. చూద్దం మరి ఏం జరుగుతుందో..??