చంద్రబాబు రాకతో టీడీపీలో హీట్ – తిరువూరు వివాదంపై ఫోకస్!
దీంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ – చంద్రబాబు ఎవరి పైన యాక్షన్ తీసుకుంటారు? లేక మళ్లీ కూల్‌గా హ్యాండిల్ చేస్తారా? అన్నది. అయితే, చంద్రబాబు స్టైల్ తెలుసుకున్న వాళ్లు చెబుతున్న మాట – “యాక్షన్ కాదు, వార్నింగ్!” ఆయన పార్టీకి హాని చేసే నేతలను నేరుగా సస్పెండ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. సాధారణంగా లోపల కౌన్సెలింగ్ ఇచ్చి, ఇరువురినీ కూర్చోబెట్టి సర్దుబాటు చేయడమే ఆయన పద్ధతి. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసు తప్పితే, అంతకుమించి పెద్ద యాక్షన్‌లు తీసుకున్న ఉదాహరణలు లేవు. అందుకే తిరువూరు కేసులో కూడా హెచ్చరికలతోనే సరిపెట్టే అవకాశం ఎక్కువగా ఉందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ ఇద్దరు నేతలు కూడా తమ తమ సామాజికవర్గాల్లో బలమైన నేతలు కావడం చంద్రబాబుకి తలనొప్పిగా మారింది. ఇటు కొలికపూడి శ్రీనివాసరావు దళిత వర్గానికి చెందినవారు.
ఇక ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటే ప్రతికూల సంకేతాలు వెళతాయని భావిస్తున్నారు. మరోవైపు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా కృష్ణా జిల్లాలో బలమైన సామాజికవర్గానికి చెందినవారు. ఆయనపైనా చర్యలు తీసుకుంటే స్థానిక స్థాయిలో ప్రతిస్పందన వచ్చే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు ఇరువురినీ పిలిపించి కఠిన హెచ్చరికలు చేసి, సమస్యను ముగించేయాలని చూస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఆయన “సస్పెన్షన్” అనే పదం వాడతారే గానీ, చివరికి కమిటీ వేసి వ్యవహారం చల్లార్చడంలో దిట్ట. మొత్తం మీద, చంద్రబాబు తిరువూరు వివాదంపై ఫోకస్ పెట్టి, పార్టీకి చెడ్డ పేరు రాకుండా సైలెంట్‌గా సర్దుబాటు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ, ఈ ఇద్దరు నేతల మధ్య మళ్లీ మంటలు చెలరేగితే మాత్రం ఈసారి ఆయన కఠినంగా వ్యవహరించే సూచనలు ఉన్నాయి.