కేసీఆర్ రాజకీయాల్లో రాటుదేలిన అపరచాణిక్యుడు.. ఆయన ప్లాన్లు అప్పటికప్పుడు ఉపయోగపడేలా ఉండవు. ఆయన మాట వెనుక ఎంతో అర్థం ఉంటుంది.. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని పట్టుకొని చివరికి రాష్ట్రాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. కేసీఆర్ అంటే కేవలం రాష్ట్ర లీడర్ కాదు దేశ విదేశాల్లో కూడా ఒక మంచి పేరు ఉంది. అలాంటి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రెండు టర్మ్ లు ఏకధాటిగా పాలన చేసింది. కానీ మూడవసారి ఓటమిపాలైంది. ఇదే తరుణంలో పార్టీ మీద అనేక విమర్శలు వస్తున్నాయి. జనాల్లో బీఆర్ఎస్ పల్చబడింది అంటూ విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.. ఇలా నడుస్తున్న సమయంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. అయితే ఈ ఎన్నిక బీఆర్ఎస్ కు ఒక జీవన్మరణ పోరాటం.. ఇక్కడ గెలిచింది అంటే ఇక కాంగ్రెస్ ఖతమైపోయి జనాల్లో బీఆర్ఎస్ కే ఆదరణ పెరుగుతుందనే మెసేజ్ వెళుతుంది.
అందుకే ఈ ఎన్నికను కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లో గెలుపే లక్ష్యంగా ఆయన కేటీఆర్,హరీష్ రావు ఇతర కీలక నేతలకు ఫామ్ హౌస్ లో సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఎలక్షన్స్ ఇంకా రెండు మూడు రోజులు ఉన్నాయి అనే సమయంలో కేసీఆర్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే కేసీఆర్ జూబ్లీహిల్స్ లో ఎన్నికలపై సర్వేలు కూడా చేయించుకొని జనాల్లో టాక్ ఎలా ఉంది అని తెలుసుకున్నారట.. దీన్నిబట్టి ఆయన ఒక కొత్త ప్లాన్ ఇచ్చారట. దాని ప్రకారమే ప్రచారం చేయాలని సూచించారట.
ఇంతకీ ఆ ప్లాన్ ఏంటయ్యా అంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు ఎంఐఎం సపోర్ట్ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఎంఐఎం ఓట్లను చీల్చే ప్రయత్నం చేయాలి. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులంతా డోర్ టు డోర్ తిరగాలని చెప్పారట. అంతే కాదు కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలపై కూడా ప్రజలకు విన్నవించాలని సూచించారట. ఈ విధంగా వెళ్తే తప్పకుండా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం సాధిస్తామని కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఇక ఎన్నికలు ఒకటి రెండు రోజులు ఉన్నాయనగా ఆయన మరోసారి సర్వే చేయించి, తాను ప్రచారానికి రావాలా వద్దా అనే దానిపై డిసైడ్ అవుతారని సమాచారం అందుతుంది.