బీహార్ ఎలక్షన్స్: ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన మహాఘట్ బంధన్ సీట్లు..

Divya
బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రోజురోజుకి ఉత్కంఠత పెరిగిపోతోంది. ముఖ్యంగా రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ (RJD) మిత్రపక్షం కోసం కాస్త దిగువచ్చినట్టుగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ప్రతిపక్ష కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం తాజాగా ఒక కొలిక్కి వచ్చినట్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కోరుకున్న సీట్లు అన్ని పార్టీలకు కేటాయించడంతో మహాఘట్ బంధన్ లో సీట్ల కేటాయింపు వ్యవహారాలకు పూర్తిగా తెరపడినట్లు వినిపిస్తున్నాయి. మొత్తం మీద 243 స్థానాలలో, RJD పార్టీ 144 స్థానాలకు మొదట పోటీ చేయాలని భావించింది. కానీ సీట్ల సర్దుబాటు నేపథ్యంలో 135 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తున్నాయి.


కాంగ్రెస్ పార్టీకి మొదట 61 స్థానాలకు సీట్లు కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు 70 స్థానాలకు లైన్ క్లియర్ అయినట్లుగా తెలిసింది. కూటమిలో భాగంగా ముఖేష్ సాన్హీ ఇన్సాన్ పార్టీ (VIP) 16 సీట్లు, అలాగే వామపక్ష కూటమికి 29 నుంచి 31 స్థానాలు కేటాయించాలని భావిస్తున్నట్లు సమాచారం. సీట్ల పరంగా సర్దుబాటు చేసుకున్నప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంపై మాత్రం కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ మిత్రపక్షాలు పార్టీలు మాత్రం RJD నేత తేజస్వి యాదవ్ అంటూ బహిరంగంగానే వెల్లడిస్తున్నారు.

ఇటీవల కాలంలో బీహార్ ప్రతిపక్ష కూటమిలో సీట్ల పంపకాలపైన అటు కాంగ్రెస్, RJD మధ్య తీవ్రమైన చర్చలు  జరిగాయి. ఇప్పుడు ఎట్టకేలకు ఆ సీట్ల పంపకాల విషయంలో క్లారిటీ ఉన్నట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు డిప్యూటీ సీఎం పోస్టుకు సంబంధించి ఎలాంటి అంశం మహాఘట్ బంధన్  లో చర్చకు రాలేదనే విధంగా తెలుస్తోంది.బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు దశలలో జరగబోతోంది. ఇందులో 243 స్థానాలలో 121 అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది మొదటి దశ నవంబర్6, రెండవ దశ నవంబర్ 11న పోలింగ్ జరగబోతోంది. ఓట్ల ఫలితం నవంబర్ 14న ఉండబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: