ఏపీ: పార్టీ మారడం పై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే..!
ఇటీవలే వైఎస్ఆర్సిపి లో ఒకరు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా తాజాగా వైసిపి పార్టీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారంపై అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం స్పందించారు. తాను పార్టీ మారుతున్నాననే విషయం పై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజము లేదని.. ఒకవేళ వదిలేస్తే రాజకీయాలే వదిలేస్తాను కానీ పార్టీ మారే ప్రసక్తి లేదంటు తెలిపారు. తాను, రేగం కుటుంబ సభ్యులు కట్టె కాలే వరకు జగన్ తోనే ఉంటామని తేల్చి చెప్పారు.
కేవలం కావాలని తన పైన కొంతమంది తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటు తెలియజేశారు. చానల్స్ లో వినిపిస్తున్నవన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని ఇలా తనపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదంటూ తెలియజేశారు. అరకు నియోజవర్గ కార్యకర్తలు, నేతలు కూడా ధైర్యంగా ఉండాలని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా గెలిచేది వైసిపి పార్టీనే అంటూ తెలియజేశారు. తాను సాధారణ జడ్పిటిసి నుంచి ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చిన ఘనత వైసీపీ పార్టీదే తన ప్రయాణం జగన్ తోనే కొనసాగుతుందని తెలిపారు.మొత్తానికి పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చారు. 2024 ఎన్నికలలో అనూహ్యంగా వైసిపి అరకు టికెట్ ఇవ్వగా ఘనవిజయంతో గెలిచారు రేగం మత్స్యలింగం.