స్విగ్గీ నుంచి మరో కొత్త డెలివరీ యాప్.. ఈ యాప్ ప్రత్యేకతలు తెలుసా?
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ యాప్ మరో స్పెషల్ డెలివరీ యాప్ ను లాంఛ్ చేసింది. టొయింగ్ పేరుతో పుణెలో ఈ యాప్ ను లాంఛ్ చేయగా ఈ యాప్ ద్వారా 100 నుంచి 150 రూపాయలకే మీల్స్ ఆర్డర్ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేసిన వాళ్లకు సర్జ్ ఫీజు కూడా వసూలు చేయడం లేదని స్విగ్గీ తెలిపింది.
సాధారణంగా స్విగ్గీ తన సొంత ప్రయోగాలను బెంగళూరులో మొదలుపెడుతుంది. అయితే అందుకు భిన్నంగా స్విగ్గీ పుణె నుంచి కార్యకలాపాలను మొదలుపెట్టింది. స్విగ్గీకి ఇప్పటికే ఏడు ప్రత్యేక యాప్స్ ఉండగా వేర్వేరు యాప్స్ ద్వారా వేర్వేరు సేవలు అందించే దిశగా స్విగ్గీ అడుగులు వేస్తోంది. మరోవైపు ర్యాపిడో సైతం ఓస్ లీ పేరుతో ఫుడ్ డెలివరీ యాప్ ను రన్ చేస్తుండటం గమనార్హం.
ఈ యాప్ ద్వారా కమిషన్ లేకుండా సేవలు అందించే దిశగా ర్యాపిడో అడుగులు వేస్తోంది. ఫుడ్ డెలివరీ యాప్స్ లో ఆర్డర్ చేసుకోవడం కంటే రెస్టారెంట్లకు వెళ్లి ఆర్డర్ చేసుకుని ఫుడ్ తీసుకోవడం ఎంతో బెస్ట్ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి కొత్తకొత్త యాప్స్ అందుబాటులోకి రావడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతోంది.
ఈ యాప్స్ వల్ల కస్టమర్లపై అదనపు భారం పెరుగుతోందని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొత్త కొత్త యాప్స్ మొదట్లో మంచి ఆఫర్లు ఇచ్చినా ఆ తర్వాత రోజుల్లో ప్రజలపై ఊహించని స్థాయిలో భారం మోపుతూ నడ్డి విరుస్తున్నాయి. ఈ యాప్స్ ను పరిమితంగా వాడితే మంచిదని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు