ఏపీ: కూటమి టాప్- 10 ఫెయిల్యూర్స్ ఇవే..!

Divya
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా అమలు చేశామంటూ.. ఈ రోజున రాయలసీమలో అనంతపురం ప్రాంతంలో "సూపర్ సిక్స్ సూపర్ హిట్" అనే పేరుతో ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశారు. అయితే ఈ సభ కూడా ఒక ప్రెస్టేజ్ గా తీసుకున్నారు కూటమి ప్రభుత్వం. భారీ ఎత్తున ప్రజలను తరలిస్తూ ఉన్నారు..ఒక వారం నుంచి అధికారుల సైతం అక్కడే పని చేస్తున్నారు. ఈ సభని చాలా గ్రాండ్ గానే సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు..రాష్ట్ర కోణంలో, ప్రజల కోణంలో ఆలోచిస్తే మాత్రం అసలు ఈ సభ ఇప్పుడు అవసరమా అన్నట్టుగా చర్చ రాజకీయ విశ్లేషకులలో జరుగుతోంది.


అయితే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండానే సూపర్ హిట్ అనే పేరుతో ఈ సభను చేశారు. ఇందులో మహిళలకు చెప్పిన ఆడబిడ్డ నిధి(రూ.1500), నిరుద్యోగ భృతి, 3000 ఇవ్వకముందే అన్ని హామీలను అమలు చేశామంటూ సక్సెస్ సభను ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాత్రం కూటమి ప్రభుత్వంలో కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయంటు తెలియజేస్తున్నారు.

రైతులకు యూరియా దొరకడం లేదు. ఇది పెద్ద ఫెయిల్యూర్. 95 వేల టన్నులు మిగిలి ఉంది అంటూ రాష్ట్రంలో  సీఎం చంద్రబాబు మీటింగ్ పెట్టి మరి చెప్పారు.కానీ ఇప్పటికీ ఏపీలో యూరియా కొరత ఉంది. ఖరీఫ్ సమయంలో యూరియా దొరకపోవడం రైతులకు ఇబ్బందికరంగానే ఉంది. అయితే ఈ విషయాన్ని వైసిపి పైన వేస్తూ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారంటు కప్పేస్తున్నారు.

గడిచిన కొద్ది నెలల క్రితం మామిడి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడ్డారు.. అలాగే కోకో రైతులు, పొగాకు రైతులు ప్రస్తుతం ఉల్లి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు.


మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటి కరణం చేయడం కూడా ఒక ఫెయిల్యూర్.


మద్యం మరో ఫెయిల్యూర్.. రేట్లపరంగా తగ్గిన.MRP కంటే ఎక్కువ రేట్లకే అమ్మేస్తున్నారు. ఊరూరా బెల్ట్ షాపులు పెరిగిపోయాయి. 99 రూపాయలకే క్వాటర్ అంటూ చెప్పుకొచ్చారు  కానీ ఎక్కడ కనిపించడం లేదు. మద్యం విషయంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టే బార్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన ఎవరు అప్లై చేయలేదు.


కరెంట్ బిల్లులు తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారు.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత  రెండుసార్లు కరెంట్ బిల్లులు పెంచారు. ఇది కూడా వైసిపి ప్రభుత్వం మీదికి నెట్టేశారు.


పరిశ్రమలకు  ఇస్తున్న భూ కేటాయింపుల విషయంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయి. పరిశ్రమలు రావాలి కాబట్టి తక్కువ రేటుకి భూములు ఇస్తున్నామంటూ ప్రభుత్వం చెప్పిన ప్రజలు నిజాన్ని గ్రహిస్తున్నారు.


ఎమ్మెల్యేల పై.. ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. వైసిపి నేతలతో కలిసిపోయి మరి దోచుకుంటున్నారు.


మంత్రులు ఎలాంటి విషయాలను మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటున్నారు.. తమకు కేటాయించిన శాఖల పైన కూడా చెప్పుకోలేని పరిస్థితులలో ఉన్నారట. కేవలం లోకేష్ ,పవన్ కళ్యాణ్, చంద్రబాబు మాత్రమే అన్ని విషయాల పైన స్పందించాల్సి వస్తోంది.


కూటమిలో  కార్యకర్తలు అసంతృప్తి అనేది కూడా ఫెయిల్యూర్. ముఖ్యంగా వీరికి బిల్లులు అవ్వకపోవడం, నామినేటెడ్ పోస్టులు కేటాయించకపోవడం వంటివి.


శిరిడి సాయి సంస్థకు టెండర్లు వారు అడిగిన రేటుకి ఇవ్వడం.. వైసీపీ ప్రభుత్వంలో కూడా వీరికే వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆ సంస్థకే కూటమి ప్రభుత్వం ఎక్కువ రేటుకే టెండర్లు ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.1,40,000 ట్రాన్స్ఫార్మర్ వంటివి అధిక రేట్లు మన దగ్గర ఉన్నాయి. ఇది కూడా ఫెయిల్యూర్. ఇతర ప్రాంతాలలో లక్ష రూపాయల లోపే లభిస్తున్నాయి ట్రాన్స్ఫార్మర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: