కేటీఆర్ నోటి దురద..లైవ్ లో సీఎం రేవంత్ రెడ్డి ని అంత మాట అనేశాడు ఏంటి..?
ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాదులోని మేడ్చల్ పరిసరాల్లో ఉన్న ఓ ఫ్యాక్టరీపై సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ రైడ్‌లో దాదాపు ₹12,000 కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ దేశ విదేశాలకు స్మగ్లింగ్ అవుతున్నట్లు విచారణలో తేలింది. టాప్ త్రీ డేంజరస్ డ్రగ్స్ అక్కడ తయారు అవుతున్నాయన్న వార్తలు వెలుగులోకి రావడంతో ఈ కేసు సంచలనంగా మారింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా మహారాష్ట్ర పోలీసులు ఆపరేషన్ జరిపి, హైదరాబాద్‌లో ఇంత పెద్ద స్థాయిలో డ్రగ్స్ మాఫియా నడుస్తున్న విషయాన్ని బయటపెట్టారు. ఈ విషయం ఆధారంగా ప్రెస్ మీట్‌లో కేటీఆర్ నిప్పులు చెరిగారు.
“హైదరాబాద్‌లో ఇంత పెద్ద స్థాయిలో డ్రగ్స్ మాఫియా నడుస్తున్నా ని ప్రభుత్వం నిద్రపోతోందా? నీ పోలీసులకు కూడా ఈ విషయం తెలియదా? ఎక్కడో మహారాష్ట్ర పోలీసులు వచ్చి రైడ్ చేయకపోతే ఈ స్కాండల్ బయటపడేది కాదా? నీ గవర్నమెంట్ ఏం చేస్తోంది?” అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు ప్రశ్నలు సంధించారు. అంతేకాదు, “నీకు సిగ్గుందా?” అని నేరుగా ప్రశ్నించడం సర్వత్రా సంచలనం సృష్టించింది. కేటీఆర్ రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత పగతో ఇలా మాట్లాడలేదని చాలామంది అంటున్నారు. ఇది పూర్తిగా రాజకీయ విమర్శలే అయినా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై “నీకు సిగ్గుందా” అన్న వ్యాఖ్య విపరీత చర్చకు దారి తీస్తోంది. ప్రజలు, రాజకీయ విశ్లేషకులు కేటీఆర్ ఈ వ్యాఖ్యను ఘాటు భాషగా, అసభ్యంగా అభివర్ణిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఇలాగ మాట్లాడటం తగదు అని నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కింది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ ఉన్న ఈ సమయంలో, కేటీఆర్ యొక్క ఈ వ్యాఖ్య మరింత వివాదాస్పదంగా మారింది. కేటీఆర్ ఈ వ్యాఖ్యల ద్వారా తన దూకుడు స్వభావాన్ని మళ్లీ ప్రూవ్ చేశాడని కొందరు అంటుంటే, మరికొందరు ఇది రాజకీయ మర్యాదలేమి అని మండిపడుతున్నారు.