"చీకట్లో చిల్లర పనులు"..మీడియా ముందు రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీసేసిన కేటీఆర్..!
ఆయన మాట్లాడుతూ.. “ఇప్పుడే మీరు చూస్తున్న ప్రతి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినది కెసిఆర్. మేము కష్టపడి ప్రారంభించిన పనులకే మీరు వెళ్లి ఫోటోలు తీసుకుంటూ మీ పేరు పెట్టుకోవడం ఏమిటి? తెలంగాణ అభివృద్ధి అంటే కేవలం మీ క్రెడిట్ కాదు, ఈ నేల కోసం మేము రాత్రింబవళ్లు కష్టపడ్డాం. మేము ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన రోజుల్లో ఎన్ని రాత్రులు నిద్రపోకుండా ప్రజల కోసం శ్రమించామో మాకే తెలుసు,” అని రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ మరింత సీరియస్ అవుతూ, “నువ్వు ఎన్ని అక్రమ పనులు చేస్తున్నావో, అవన్నీ బయటకు వస్తాయి. మేము చీకట్లో చిల్లర వేషాలు వేయం, ముడుపులు తీసుకుంటేనే పనులు చేసే వ్యక్తులు మేము కాదు. తెలంగాణ బిడ్డలమని గర్వంగా చెప్పుకుంటాం. కాబట్టి తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసం మనుషులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు,” అని హెచ్చరించారు.
అలాగే ఆయన రేవంత్ రెడ్డిపై మరింత విమర్శలు చేస్తూ, “కేసీఆర్‌నే ప్రతి ప్రాజెక్టుకు పునాది వేసిన నాయకుడు. ఆయనే ప్రారంభించిన పనుల వద్ద నువ్వు నవ్వుతూ ఫోటోలు దిగుతున్నావ్.. తెలంగాణలో ఏదైనా ప్రాజెక్ట్ రావాలంటే ముడుపులు తప్పనిసరి అన్న మాటలకి నీ రాజకీయ విధానం నే చెప్పేస్తున్నాయి. మేము అలాంటి చీప్ రాజకీయాలు చేసే వాళ్లం కాదు. తెలంగాణ కోసం మేము రాత్రింబవళ్లు కష్టపడ్డాము, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రాణం పెట్టి పోరాడాము. మేము చేసిందాన్ని గుర్తుంచుకోవడం ప్రజల కర్తవ్యం,” అని అన్నారు.
కేటీఆర్ ఈ ప్రెస్ మీట్ మొత్తం ఆవేశభరితంగా సాగింది. రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన విమర్శలు, ఆయనను మీడియా ముందు కడిగిపారేసిన తీరు రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కేటీఆర్ మాట్లాడే తీరు ఆత్మవిశ్వాసంతో ఉండేది, కానీ ఈసారి ఆయన చూపిన దూకుడు అందరినీ ఆశ్చర్యపరిచింది. మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి పరువుతీసినట్టుగా కేటీఆర్ ప్రెస్ మీట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.