Dasara Schools Holidays: ఏపీలో అలా..తెలంగాణాలో ఇలా..దసరా సెలవుల్లో ఇంత తేడా ఎందుకు..?
దసరా హాలీడేస్ :
దసరా పండుగ సమయంలో పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, కొన్ని ప్రైవేట్ సంస్థలు సెలవులు ఇస్తాయి. పాఠశాలలు, కళాశాలల్లో సాధారణంగా 7 నుండి 10 రోజుల వరకు సెలవులు ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణంగా 2-3 రోజుల పబ్లిక్ హాలీడే ఉంటుంది. ఐటీ, ప్రైవేట్ కంపెనీల్లో అయితే సాధారణంగా పండుగ రోజు లేదా ఒక రోజు మాత్రమే సెలవు ఇస్తారు.
ఆంధ్రప్రదేశ్ దసరా సెలవుల లిస్ట్ :
ఈ ఏడాది విద్యా క్యాలెండర్ ప్రకారం సెలవులు ఈ విధంగా ఉన్నాయి. ఏపీలో విద్యార్థులకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉంటాయి అని అఫిషియల్ గా ప్రకటించింది ప్రభుత్వం. అంటే విద్యార్థులకు మొత్తం 9 రోజుల పాటూ సెలవులు ఉంటాయి అనమాట. ఇక జూనియర్ కాలేజీలకు, అలాగే క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు దసరా సెలవుల విషయానికి వస్తే అది వేరే లెక్క. రిలీజ్ అయిన విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయి. క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు మాతమే ఈ దసరా సెలవులు ఇస్తారు. వీరికి మొత్తం 6 రోజులు దసరా సెలవులు ఉంటాయి అనమాట.
తెలంగాణ దసరా సెలవుల లిస్ట్ :
తెలంగాణలో కూసింత ముందు గానే సెలవులు స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3, 2025 వరకు ఈ దసరా సెలవులు ఉన్నాయి. తెలంగాణ లో ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో దసరా టాప్ ప్లేస్ లో ఉంటుంది. చాలా ముఖ్యమైనది ఈ పండుగను జరుపుకుంటారు. ఇక తెలంగాణలో ఒకేసారి బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని రాష్ట్రంలోని స్కూల్స్, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ఇచ్చారు. మొత్తం మీద ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు వరుసగా సెలవుల మీద సెలవులు వచ్చాయి. పిల్లలు హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తారు. దసరా హాలీడేస్ అనేవి హిందువుల ఆధ్యాత్మిక పండుగ సమయంలో ఇచ్చే విరామం. ఇది పండుగ ఆనందం, ఆధ్యాత్మికత, కుటుంబ సమయాన్ని కలిపే ప్రత్యేక సమయం గా చెప్తుంటారు పెద్దలు.