బాబు కేబినెట్ లో 96 శాతం మంది నేర చరితులేనా.. ఆ వార్త నిజమేనా?
జగన్ మీద కేసులు పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీ జగన్ ను వేధిస్తే చంద్రబాబు నాయుడుపై జగన్ కేసులు పెట్టడం జరిగింది. జగన్ నారా లోకేష్ పై కూడా కేసులు పెట్టించడం జరిగింది. సాక్షి నేతలు ఎడిఆర్ నివేదిక ఆధారంగా చంద్రబాబు మీద 19 కేసులు పవన్ మీద 8 కేసులు వాసంశెట్టి సుభాష్ మీద 12 కేసులు, అచ్చెన్నాయుడు మీద 13 కేసులు, లోకేష్ మీద 17 కేసులు, నారాయణ మీద 8 కేసులు కొల్లు రవీంద్ర మీద 15 కేసులు, రామ్ ప్రసాద్ రెడ్డి మీద 5 కేసులు, సవిత మీద 10 కేసులు, అనిత మీద 7 కేసులు , దుర్గేష్ మీద 7 కేసులు, నిమ్మల రామానాయుడు మీద 20 కేసులు, జనార్దన్ రెడ్డి మీద 9 కేసులు, బాల వీరాంజనేయస్వామి మీద 11 కేసులు, గొట్టిపాటి రవికుమార్ మీద 8 కేసులు, పార్థసారథి మీద 5 కేసులు, సత్య ప్రసాద్ మీద 3 కేసులు, సంధ్యారాణి మీద 3 కేసులు ఉన్నాయని పేర్కొంది.
దేశంలో టాప్ 10 అధికార పార్టీ సంపన్న ప్రజా ప్రతినిధులలో పెమ్మసాని చంద్రశేఖర్ 5705 కోట్లు, తర్వాత స్థానంలో డీకే శివకుమార్ 1413 కోట్లు, చంద్రబాబు నాయుడు 930 కోట్లు, నారాయణ 824 కోట్లు, నారా లోకేష్ 542 కోట్లు కలిగి ఉన్నారని సాక్షి పేర్కొంది. ఏపీలో అందరు నేతలు నేర చరితులే అనే విధంగా ఈ కథనం సరైన కథనం కాదని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.