కేసీఆర్ నయా ప్లాన్.. బీజేపీని కమ్మేస్తాడా?

Pandrala Sravanthi
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రగడ ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పై  సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మొన్నటి వరకు కాళేశ్వరం రిపోర్టుపై  సిఐడి లేదంటే సిట్ కు అప్పజెప్తారని బీఆర్ఎస్ పార్టీ అనుకుంది. కానీ అనూహ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పనిని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సిబిఐకి అప్పగించారు.. దీన్నిబట్టి చూస్తే కేసీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఎంక్వైరీ వేస్తే వారికి మైనస్ అవుతుందని, ఈ పనిని బిజెపి ఖాతాలో పడేలా  కేంద్ర ప్రభుత్వ సిబిఐకి అప్పజెప్పింది.. మరి దీనిపై కేంద్రం రంగంలోకి దిగి కాలేశ్వరం ప్రాజెక్టుపై నిబద్ధతతో  ఎంక్వైరీ చేయిస్తుందా  లేదంటే కేసీఆర్ తో మాట్లాడుతుందా అనేది  చూద్దాం.. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.. 


దాని తర్వాత స్థానాల్లో బీఆర్ఎస్,బీజేపీ లు ఉన్నాయి.. ప్రస్తుతం ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీలోని కేసీఆర్ ని  జైలుకు పంపాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది.. ఇదే తరుణంలో కాళేశ్వరం అవినీతిపై సిబిఐ కి కేస్ అప్పగించింది. అయితే దీనిపై కేంద్రం సీరియస్ గా రియాక్ట్ అయ్యి  అవినీతిపై విచారణ చేస్తే కేసీఆర్ తప్పకుండా జైలుకు వెళ్తారని అంటున్నారు. ఇదే విషయంలో కేసీఆర్ బిజెపితో లోపాయికారి ఒప్పందం చేసుకొని ఎంక్వైరీ జరగకుండా చూసుకుంటారనేది కూడా మరో వాదన.. వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో లేదంటే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ బిజెపి కలిపి పోటీ చేద్దామనే ఆలోచనకు వస్తే మాత్రం ఈ ఎంక్వయిరీ కాస్త పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది.


మరి దీనిపై కేసీఆర్ సమాలోచన చేసి బీజేపీతో దోస్తీ కట్టి ఈ ఇష్యూ నుంచి బయట పడతారని కొంతమంది అంటున్నారు. కట్ చేస్తే ఇదే విషయంపై కేసీఆర్ కేటీఆర్ కలిసి న్యాయ నిపుణులతో మంతనాలు కూడా జరుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇదే తరుణంలో మోడీ, రేవంత్, చంద్రబాబు కలిసి గోదావరి నీళ్లను ఏపీకి పంపే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.. ఈ విధంగా ఎవరి వ్యూహాలు వారికే ఉన్నాయి. ఇందులో కీలకంగా బీజేపీ మారింది.. కాళేశ్వరంపై  క్లియర్ గా ఎంక్వయిరీ చేయించి అరెస్టు చేస్తుందా లేదంటే  వచ్చే ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ తో కలిసి పోవడానికి ప్లాన్ వేస్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: