పవన్ క్రిష్ కాంబోలో మరో మూవీ కష్టమే.. ఆ రిస్క్ చేస్తారా?
పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలైన 'హరిహర వీరమల్లు' సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదనేది వాస్తవం. సినిమా షూటింగ్ కొంతభాగం పూర్తయిన తర్వాత క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై సందిగ్ధత నెలకొని ఎట్టకేలకు ఈ సినిమా ఈ ఏడాది జులై నెలలో విడుదలైంది. అయితే, సినిమా ఫలితం ఎలా ఉన్నా, పవన్, క్రిష్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇద్దరూ వేర్వేరు సందర్భాల్లో స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే, క్రిష్ తన తదుపరి చిత్రాన్ని బాలకృష్ణతో 'ఆదిత్య 999 మ్యాక్స్' పేరుతో ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. బాలయ్యతో క్రిష్ది ఒక సినిమాతో విజయవంతమైన కాంబినేషన్ కాబట్టి కథానాయకుడు, మహానాయకుడు సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
మరోవైపు, పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో మరో సినిమా రానుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, 'హరిహర వీరమల్లు' సినిమా విషయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా, పవన్ అభిమానులు మాత్రం ఈ కాంబినేషన్లో మరో సినిమా వద్దని తమ అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే నిరాశను మిగిల్చిన ఈ కలయిక, మరోసారి అదే అనుభవాన్ని రిపీట్ చేస్తుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. పవన్, క్రిష్ మంచి స్నేహితులైనా, సినిమా ఫలితాల దృష్ట్యా ఈ కలయికపై అభిమానుల్లో కొంత నిరుత్సాహం నెలకొంది. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు