త్వరలో ఈటల కొత్త పార్టీ..హరీష్ రావుతో పాటు ఆ నేతలంతా.?

Pandrala Sravanthi
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మాత్రమే లీడ్ చేసే దిశలో ఉన్నాయి.. ఇదే తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో పుట్టినటువంటి చిచ్చు వల్ల జాగృతి పేరుతో సరికొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కవిత. ఇదిలా నడుస్తున్న తరుణంలో  తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతున్నట్టు రాజకీయ వర్గాల్లో  వార్తలు  వినిపిస్తున్నాయి. మరి ఆ పార్టీ ఎవరు పెడుతున్నారు.. ఎందుకు పెడుతున్నారు  అనే వివరాలు చూద్దాం.. తెలంగాణ బీజేపీకి కొత్త రథసారధి రామచంద్ర రావు వచ్చారు. అయితే ఈ బీజేపీ అధ్యక్ష పీఠం కోసం చాలామంది నేతలు కొట్లాడారు. ఇదే తరుణంలో ఈటల రాజేందర్ కూడా ఈ అధ్యక్ష పీఠం తనకే దక్కుతుందని అనుకున్నారు.


 కానీ చివరి సమయానికి వచ్చేసరికి రామచంద్రరావుకు బీజేపీ చీఫ్ పదవి వెళ్ళిపోయింది.. దీంతో బిజెపి అధ్యక్ష పీఠాన్ని ఆశపడి  భంగపడిపోయినటు వంటి ఈటల రాజేందర్  చాలా బాధపడ్డారు. తాజాగా ఆయన  హుజురాబాద్ కార్యకర్తలను ఉద్దేశించి పలు సంచలనమైన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే ఆయన బిజెపి పార్టీకి గుడ్ బై చెప్పేలా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హుజురాబాద్ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. పదవుల కోసం ఎవరి దయాధ్యాక్షిన్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు.


అయితే ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే మాత్రం  ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారని, ఎవరి దగ్గర పదవులను అడిగే అవసరం లేదని తానే ఇకనుంచి పదవులు ఇచ్చే స్థాయికి ఎదుగుతానని చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది.. ఒకవేళ ఈటెల రాజేందర్ పార్టీ పెడితే మాత్రం  హరీష్ రావు తో పాటు ఇతర నేతలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ తెలంగాణలో ఈటల రాజేందర్ కొత్త పార్టీ తీసుకువస్తే తప్పకుండా బిఆర్ఎస్ కు గండి పడ్డట్టే అవుతుంది. మరి చూడాలి ఈటల రాజేందర్ మాటల వెనక కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: