ప్రపంచంలో అత్యున్నత సంపన్న దేశాలలో అమెరికా ఒకటి. అమెరికాతో యుద్ధం లాంటివి పెట్టు కోవడానికి కూడా చాలా దేశాలు వెనకడుగు వేస్తూ ఉంటాయి. దానికి ప్రధాన కారణం ప్రపంచం లోనే అత్యున్నత సంపన్న దేశాల్లో ఒకటి కావడం వల్ల ఈ దేశం ఆర్థికంగా ఎంతో బలంగా ఉంటుంది. అలాగే వీరి దగ్గర అను సంపద కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. దానితో ఏదైనా చిన్న స్థాయి దేశం అమెరికా లాంటి అత్యున్నత సంపద కలిగిన దేశంతో తలపడాలి అంటే భయపడుతూ ఉంటాయి. ఇకపోతే తాజాగా ఓ దేశం అమెరికాకు వార్మింగ్ ఇచ్చింది.
దానితో అమెరికా కూడా వెనక్కు తగ్గింది. అసలు అమెరికా ఏ దేశం వార్నింగ్ ఇవ్వడంతో వెనక్కు తగ్గింది అనే వివరాల్లోకి వెళితే ... అమెరికా తాజాగా చేసిన ఒక చర్య వల్ల రష్యా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ వల్ల అమెరికా వెనక్కు తగ్గ వలసి వచ్చింది. తాజాగా నల్ల సముద్రం మీదుగా అమెరికా సైన్యం సౌదీ అరేబియా , అరబ్ దేశాలకు వెలుతూ ఉండగా అమెరికా సైన్యం , రష్యా సరిహద్దుల దగ్గరికి వచ్చింది. దానితో అమెరికా సైన్యం ప్రయాణిస్తున్న B 52 బాంబర్ విమానాన్ని రష్యన్ సుకోవిట్ 27 అడ్డుకుంది.
అమెరికా సైన్యాన్ని , రష్యా సైన్యం అడ్డుకోవడం మాత్రమే కాకుండా మీరు రష్యా సరిహద్దుల దగ్గరికి వస్తున్నారు. మీరు మరింత దగ్గరికి వచ్చినట్లయితే మా ఫైటర్ జెట్లకు పని చెప్పవలసి ఉంటుంది అని రష్యా , అమెరికాకు వార్నింగ్ ఇచ్చిందట. దానితో అమెరికా కి రష్యా ఇచ్చిన వార్నింగ్ తో వెనక్కు తిరిగి వెళ్లిపోయింది. అలా అమెరికా , రష్యా సరిహద్దుల దగ్గరికి వెళ్లిన సమయంలో రష్యా వార్నింగ్ ఇవ్వడంతో అమెరికా మళ్లీ అక్కడి నుండి వెనక్కు తిరిగి వెళ్ళింది.