ఏపీ: తల్లుల ఖాతాలో డబ్బు జమ.. టిడిపి పోస్ట్ వైరల్ ..!
అయితే ఈ మేరకు తల్లుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా టిడిపి ఒక పోస్ట్ షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులు వేసామని పార్టీ తెలియజేసింది. ఇద్దరు పిల్లలు ఉన్న ఒక లబ్ధిదారుని ఖాతాలో 26వేల రూపాయలు పడ్డట్టుగా బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది అంటూ టిడిపి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే మరో నాలుగు వేల రూపాయలు స్కూల్ ఖాతాలో పడుతాయని తెలియజేయడం జరిగింది.
తల్లికి వందనం పథకాన్ని గురువారం నుంచి అమలు చేశారు. ఏపీ అంతట 35,44,459 మంది తల్లుల ఖాతాలో ఈ డబ్బులు జమ చేశామంటూ ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. కుక్క విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున నిధులను విడుదల చేశామని ఇందులో 13 వేల రూపాయలు బ్యాంకు ఖాతా నుంచి తల్లుల ఖాతాలో పడతాయి మిగిలిన రెండు వేల రూపాయలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు చేరుతుంది అంటూ తెలియజేయడం జరిగింది. మరి ఏ మేరకు తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి అనే విషయంపై మరి కొన్ని గంటలలో తెలియబోతోంది. మొత్తానికి ఈ పోస్టులు అయితే సోషల్ మీడియాలో టిడిపి నేతలను ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది.