ఏపీ: కూతురు మాటలపై సంచలన వ్యాఖ్యలు చేసిన ముద్రగడ..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా అన్న చెల్లెల రాజకీయమే వినిపిస్తూ ఉన్నది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల మధ్య రాజకీయ విభేదాలు వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు తాజాగా ముద్రగడ పద్మనాభ కుటుంబంలో కూడా అన్న చెల్లెల రాజకీయం జరుగుతోంది. ఇటీవలే ముద్రగడ కుమార్తె తన సోదరుడు(గిరి )పైన పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. తన తండ్రికి క్యాన్సర్ ఉందని ఈ విషయం తెలిసి కూడా తన సోదరుడు తండ్రి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని తెలియజేసింది.

అయితే ఈ విషయం పైన ముద్రగడ మాట్లాడుతూ తన కుమార్తె ,అల్లుడు పై తీవ్ర ఆగ్రహాన్ని తెలిపారు. తమ కుటుంబం పైన మరొక కుటుంబం గత కొంతకాలంగా దాడి చేస్తుందంటూ తనకు క్యాన్సర్ వచ్చిందని తన చిన్న కొడుకు పట్టించుకోవడం లేదంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తన కుమారుడు ఎదుగుదలను చూసి కొంతమంది ఏడుస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు. తన ఆరోగ్యం పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఒక లేఖను కూడా విడుదల చేశారు.



మా కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా ఆగిపోయాయి..తన కొడుకు, తనకు మధ్య మనస్పర్ధలు పెంచి దూరం చేయాలనే విధంగా కొంతమంది ప్రయత్నిస్తున్నారు.. ఎన్ని జన్మలెత్తినా కూడా వారి ఇంటిలోకి కూడా అడుగు పెట్టానంటూ తెలిపారు. తన చిన్న కుమారుడు గిరి వియ్యంకుడు శివాజీ మధ్య మనస్పర్దలు తేవాలని చూస్తున్నారని ఇటువంటి కుళ్ళు రాజకీయాలు మానుకోవడం మంచిది అంటూ తెలిపారు.. తన కొడుకునే కాదు నా మనవడిని కూడా రాజకీయాలలోకి తీసుకువెళ్తాను ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువెళ్తానంటూ తెలిపారు. తనపై తప్పుడు సమాచారాన్ని పిచ్చిపిచ్చిగా మాటలతో ప్రజలకు ఇవ్వకండి అంటే ఫైర్ అయ్యారు.గతంలో నా భార్యకు క్యాన్సర్ వచ్చినప్పుడు వారి ఇంటికి వెళితే ఐదు నిమిషాలు కూడా రావద్దని తన కూతురు అల్లుడు చెప్పారని అలాంటిది ఇప్పుడు వీళ్లే మళ్ళీ మాట్లాడుతున్నారు అంటు ఫైర్ అయ్యారు.. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే కాపులను బీసీలోకి జరిపే కార్యక్రమాలు చేయించండి సూపర్ సిక్స్ ను అమలు అయ్యేలా చేయించండి.. పబ్లిసిటీ కోసం ఇంత నిజానికి దిగజారవద్దు అంటే ఎన్ని జన్మలెత్తిన మీకు మాకు సంబంధాలు ఉండవు అంటూ తేల్చి చెప్పేశారు ముద్రగడ. తన కుమారుడు గిరినే దగ్గరుండి తనకు సంబంధించిన అన్ని విషయాలను చూసుకుంటున్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: