ఏపీ: వైసీపీ పార్టీకి షాక్..RK అరెస్టుకు రంగం సిద్ధం..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది వైసిపి నేతల అరెస్టు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది నేతల మీద కక్ష సాధింపులు చేస్తున్నారనే విధంగా వైసీపీ పార్టీ కూడా ఆరోపణలు చేస్తోంది. అయినా కూడా అరెస్టులు మాత్రం ఆపడం లేదు. ఏపీలో కీలకమైన నియోజకవర్గాలలో మంగళగిరి కూడా ఒకటి అక్కడ వైసిపి పార్టీలో ఈలక నేతగా ఆర్కే ఉన్నారు. అయితే తాజాగా ఆర్కే ని కూడా కూటమి ప్రభుత్వం అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది అన్నట్లుగా వినిపిస్తున్న ఈ వాటి గురించి చూద్దాం.


నారా లోకేష్ గారి సొంత నియోజకవర్గమైనటువంటి మంగళగిరి నియోజవర్గానికి సంబంధించి గత రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ఓడిపోయిన ఆర్కే ఈ మధ్యకాలంలో సైలెంట్ గా ఉన్నారు. అసలు ఆయన ఎలాంటి విషయం పైన కూడా మాట్లాడడం లేదు. అయితే ఈ సమయంలోనే ఆయన పేరు తెరమీదకి వచ్చినట్టుగా తెలుస్తోంది. టిడిపి పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించినటువంటి కేసులలో కొంతమందికి బెయిల్ వచ్చాయి. దేవినేని అవినాష్, ఆ తర్వాత సజ్జల వంటి వారికి కూడా బెయిల్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ కేసులో నిందితుడుగా ఉన్నటువంటినేత ఆర్కే.. ఈ వైసీపీ నేత పేరు కూడా ఉండడంతో తను బెయిల్ పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఇంతవరకు ఆయన వేయకపోవడంతో  ఇప్పుడు బెయిల్ పిటిషన్ వేయడంతో ఆర్కే అరెస్టుకు రంగం సిద్ధమైనటువంటి  చర్చ ఇప్పుడు నడుస్తోంది. మరి ఇందుకు సంబంధించి ఈ విషయం పైన వైసిపి మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇతరత్రా నేతల పైన కూడా కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో చాలామంది నేతల పేర్లు వినిపించాయి. ఒక్కొక్కరిని కూడా అరెస్టు చేస్తూ ఉంది ఏపీ ప్రభుత్వం. మరి రాబోయే రోజుల్లో మరేంత మందిని అరెస్టు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: