కవితా నీకు రాజకీయాలు వద్దు... ఆ మాటతోనే ఇంత కథ నడిచిందా..?
భారత రాష్ట్ర సమితిలో ఏం జరుగుతుంది ? ఏం జరగబోతుంది ? ఇది తెలంగాణ రాజకీయ వర్గాలలో చాలామందికి వస్తున్న సందేహం. కానీ ఇది ఒక పొలిటికల్ కుటుంబ కథ చిత్రం. అసలు ఏం జరుగుతుందో ? కల్వకుంట్ల కుటుంబంలోని ముఖ్యులకు తప్ప ఎవరికీ తెలియదు అనుకోవాల్సిందే. కానీ కవిత మాటలను బట్టి అర్థం చేసుకుంటే కొంతమందిని దూరం పెట్టకపోతే చీలిక వస్తుందని నేరుగా డాడీ కేసిఆర్ కు కవిత లేఖ ద్వారా సందేశం పంపారు. ఆమె చెప్పిన కోవర్టులు , దెయ్యాలు ఎవరో బిఆర్ఎస్ అగ్ర నాయకులు అందరికీ తెలుసు. వారిని కనుక కేసిఆర్ దూరం పెట్టకపోతే కుమార్తె ఎమ్మెల్సీ కవిత తన దారి తను చూసుకోవటం కాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే కవితకు రాజకీయాల వద్దని కెసిఆర్ చుట్టూ ఉన్న కోటరీ కెసిఆర్ ద్వారా కవితపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది కెసిఆర్ చెప్పిన ఆ మాటతోనే కవిత తీవ్రంగా హర్ట్ అయినట్టు తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత అరెస్టు కావడానికి ముందు ఆ తర్వాత కుటుంబంలో చాలా పరిణామాలు జరిగాయట. కవిత ఎప్పటికప్పుడు వెనక్కి వెళుతున్నారు.. ఎప్పుడో ఒకసారి తెర ముందుకు వస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చి నా నాలుగు నెలలకే 2019లో జరిగిన ఎన్నికలలో సిట్టింగ్ ఎంపీగా ఉండి నిజామాబాద్లో ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వటానికి కేసీఆర్ వెనకా ముందు చాలా ఆలోచించారు. లిక్కర్ కేసులో అరెస్టు అయిన తర్వాత ఇక కవితను రాజకీయాలకు దూరంగా ఉండాలని కోటరి కేసీఆర్ ద్వారా ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. ఆరు నెలల పాటు ఓపిక పెట్టిన ఆమె ఆ తర్వాత తాను రాజకీయాలకు దూరంగా ఉండలేనని తెరపైకి వచ్చేసారు. పార్టీ కార్యక్రమాలపై సమాచారం లేకపోయినా జాగృతి పేరుతో ఆమె రాజకీయం చేశారు. అక్కడ నుంచి ఆమె బరస్ట్ అయిపోయారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు