ఇక మీరు జన్మలో బాగుపడరు.. పాక్ ఆర్మీపై విమర్శల వెల్లువ..!
అయితే ఈ ఘటనతో ఉగ్రవాద సంస్థలకు, పాకిస్థాన్ సైన్యానికి మధ్య ఉన్న సంబంధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో జైష్- ఎ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కొందరు సభ్యులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఒక సీనియర్ అధికారి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి వారిని పరామర్శించిన ఉదంతం వెలుగు చూసింది. అలాగే భారత్ దాడిలో జెఈఎం ఉగ్రవాది యాకూబ్ మొఘల్ మృతి చెందాడు. అతని అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు హాజరు కావడం కూడా చర్చనీయాంశంగా మారింది.
ఒక ఉగ్రవాది అంత్యక్రియలకు పోలీసులు, అనుమానిత నిఘా అధికారులు సహా పాకిస్తాన్ భద్రతా సిబ్బంది హాజరైనట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తోందని మరోసారి నిరూపితం అయింది. ఇండియాలో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైష్- ఎ మహ్మద్ వంటి సంస్థలను పాకిస్థాన్ సైన్యం, నిఘా సంస్థ ఐఎస్ఐ వెనకేసుకొస్తుందని చాలా కాలం నుంచి భారత్ ఆరోపిస్తుంది. తాజా పరిణమాలు భారత్ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చాయి. దీంతో పాక్ ఆర్మీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరవుతారా.. ఇక మీరు జన్మలో బాగుపడరంటూ పాక్ సైన్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు