ఇవాళ అమరావతికి మోడీ.. చరిత్రలో నిలిచేలా కార్యక్రమం?
సభా వేదికపై 14 మంది ప్రముఖులు ఆసీనులవుతారు. ప్రధాని మోదీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ, కేంద్ర మంత్రులు పెమ్మసాని, బండి సంజయ్, శ్రీనివాస భూపతి వర్మ, రామ్మోహన్ నాయుడు సహా సినీ హీరో చిరంజీవి, ఇతర వీఐపీలు హాజరవుతారు.
కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి లక్షలాది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుంచి దాదాపు 5 లక్షల మంది పాల్గొనేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మూడు భారీ పందిళ్లు, 3400 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, 8 రూట్లు, 11 పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. వేసవి వేడిమిని దృష్టిలో ఉంచి తాగునీరు, మజ్జిగ, ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు. ప్రజల ఉత్సాహం, ఈ కార్యక్రమ విజయానికి సూచికగా నిలుస్తుంది.
ప్రధాని పర్యటన, భారీగా ప్రజల హాజరుతో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. 6 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ ద్వారా వాహన రాకపోకలు, భద్రతను పోలీసులు పర్యవేక్షిస్తారు. అమరావతి రీస్టార్ట్ కార్యక్రమం రాష్ట్ర రాజధాని అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఈ చారిత్రక సందర్భం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు