
రేవంత్ స్కెచ్: KCR కు బిగ్ షాక్.. ఇక ఫామ్ హౌస్ లోనే ఉండాలి ?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటిపోయిన నేపథ్యంలో... ఆ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేయబోతున్నారు కేసీఆర్. ఇందులో భాగంగానే ఏప్రిల్ 27వ తేదీన గులాబీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో... 10 లక్షల మంది జనాలతో బహిరంగ సభకు ప్లాన్ చేశారు కేసీఆర్.
ఈ బహిరంగ సభ నుంచే కేసీఆర్ వార్ స్టార్ట్ అవుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ నిర్వహించబోయే రజతోత్సవ సభ కు వరంగల్ పోలీసులు అడ్డంకులు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గులాబీ పార్టీ నిర్వహించబోతున్న రజతోత్సవ సభ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమల్లోకి తీసుకువచ్చారట పోలీసులు. సిటీ పోలీస్ యాక్ట్ అమలుతో గులాబీ పార్టీ సభ రద్దయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
ఈ సభ నిర్వహించకుండా సిటీ పోలీస్ యాక్ట్ ను వరంగల్ జిల్లాలో.. కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోందని గులాబీ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ పోలీసుల ఆదేశాల ప్రకారం నిన్నటి నుంచి మరో 30 రోజులపాటు జిల్లా వ్యాప్తంగా సిటీ పోలీస్ యాక్ట్ అమల్లోకి రాబోతుంది. ఈ రూల్ ప్రకారం ఊరేగింపులు అలాగే బహిరంగ సభలు... లాంటివి పెడితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. మరి ఈ రూల్ పై గులాబీ పార్టీ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.