
టీడీపీ: పార్టీ పుట్టింది ఎక్కడో తెలుసా..?
సీనియర్ ఎన్టీఆర్ నిమ్మకూరులో పుట్టి గుంటూరులో తన చదువును పూర్తి చేసి, మద్రాసులో నటుడుగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు సీనియర్ ఎన్టీఆర్. ఇక సీనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా తొలి అడుగు హైదరాబాదులోని గండిపేట నుంచి అబిడ్స్ రామకృష్ణ స్టూడియోలో మొదలుపెట్టారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ తెల్లవారుజామున 4:30 నిమిషాలకు కారులో వెళుతూ ఉండగా ఈయనను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున బారులు తీరుతూ రోడ్డు వెంట వచ్చారట.. 1982 మార్చి 29న సీనియర్ ఎన్టీఆర్ టిడిపి పార్టీని స్థాపించారు.
ఆదర్శనగర్లో కొత్త ఎమ్మెల్యే గా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారని ప్రకటించడం జరిగింది.. అందుకే అటు భాగ్యనగర్ కు సీనియర్ ఎన్టీఆర్కు మంచి అనుబంధంగా ఉండేదట.గోల్కొండలో రామకృష్ణ స్టూడియోలో నుంచి జనచైతన్య యాత్రకు సైతం సీనియర్ ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారట. అలా 9 నెలల పాటు యాత్ర సాగించిన తర్వాత 1983 జనవరి ఐదున ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎన్టీఆర్ భారీ విజయాన్ని అందుకోగా.. 1983 జనవరి 9న ఎల్బీ స్టేడియంలో మొదటిసారిగా సీఎం గా ప్రమాణస్వీకారం చేశారు సీనియర్ ఎన్టీఆర్. ఇందుకోసం" చైతన్య రథం " అనే యాత్రను కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా కాకి దుస్తులను ధరిస్తూ ప్రసంగాలను చేస్తూ ఉండేవారు సీనియర్ ఎన్టీఆర్. 1983 జనవరి 7న మధ్యాహ్న ఎన్నికల ఫలితాలు రావడంతో.. టిడిపి పార్టీ 199, కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలను సంపాదించుకుంది.