టీడీపీ భారీ మెజారిటీలు మంచులా కరిగిపోతున్నాయా ..?

frame టీడీపీ భారీ మెజారిటీలు మంచులా కరిగిపోతున్నాయా ..?

RAMAKRISHNA S.S.
2024 లో జరిగిన సాధారణ ఎన్నికల లో ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీ తో ఘనవిజయం సాధించి అధికారం లోకి వచ్చింది . 2019 ఎన్నికల లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్ల కే పరిమితం అయింది .. వైసిపి నుంచి పోటీ చేసిన వారు అందరూ భారీ భారీ మెజార్టీల తో ఘనవిజయలు సాధించారు .. వైసీపీకి ఏకంగా 150 సీట్లు దక్కాయి అంత‌ బాగానే ఉంది ఐదేళ్లలో వైసిపి తీవ్రమైన ప్రజాగ్రహానికి గురికాక తప్పలేదు .. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు 2024 ఎన్నికలలో ఆయనకు ఘోర పరాజయాన్ని రుచి చూపించాయి .


తెలుగుదేశం పార్టీని జగన్ 23 సీట్లకు పరిమితం చేస్తే మొన్న ఎన్నికలలో కూట‌మీ పార్టీలు అన్నీ కలిసి జగన్ను కేవలం 11 సీట్లకే పరిమితం చేశాయి .. కూటమి నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు భారీ మెజార్టీ తో ఘన విజయాలు సాధించారు .. అయితే భారీ మెజార్టీలు కరిగిపోక తప్పదని ప్రజల్లో సరైన పట్టు లేకపోతే ప్రజలకు మంచి చేయకపోతే ఏం జరుగుతుందో మొన్న ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైసిపి అభ్యర్థులకు బాగా తెలుసు .. 2019 లో భారీ మెజార్టీతో గెలిచిన వారు అందరూ గ‌త‌ ఎన్నికలలో అంతకు మించిన మెజార్టీలతో చిత్తుచిత్తుగా ఓడిపోయారు ..


ఇక‌ ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి మూడు పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేలలో చాలామంది అప్పుడే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను తెచ్చుకుంటున్నారు .. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా దోపిడీలు అవినీతి సొంత పార్టీ క్యాడర్ను ఇబ్బంది పెట్టడం భారీ స్థాయిలో కమిషన్లు చేస్తూ తమ పబం గడుపుకుంటున్నారు .. ప్రభుత్వం ఏర్పడి ఏడాదికాకముందే అప్పుడు వీరుపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది మీరు మారకపోతే 2024 ఎన్నికలలో వైసిపి అభ్యర్థుల మెజార్టీలు ఎలా కరిగిపోయాయో వీరి మెజార్టీలు కూడా కరగటం అప్పుడే మొదలైంది అన్న చర్చలు ఏపి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి ..

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP

సంబంధిత వార్తలు: