అల్లు అర్జున్ కేసులో రూ.100 కోట్ల భారీ కుట్ర ?

frame అల్లు అర్జున్ కేసులో రూ.100 కోట్ల భారీ కుట్ర ?

Veldandi Saikiran
ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప-2 సినిమాను తీసిన సంగతి తెలిసిందే.

కాగా, ఈ సినిమా విడుదలైన మొదటి రోజే పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో రిలీజ్ చేసిన రోజున ఓ మహిళ తొక్కిసలాటలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా అల్లు అర్జున్ పైన కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అల్లు అర్జున్ ను ఒకరోజు జైలులో కూడా వేశారు. ఇక అనంతరం అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చారు.

ఇక ఈ విషయం పైన తాజాగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. తెలంగాణ పోలీసులు 100 కోట్ల రూపాయలు తీసుకొని అల్లు అర్జున్ పైన ఉన్న కేసులని నీరు కార్చారానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపిస్తున్నారు. బెట్టింగ్ యాప్ లను నటీనటులు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ హీరోలు, హీరోయిన్లు వందల కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు.

ప్రమోట్ చేస్తే చారిటీ కార్యక్రమాలు చేయాలి లేదంటే మానేయాలి అని కేఏ పాల్ అన్నారు. నటీనటులకు ఇంత కక్కుర్తి ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. యువత కూడా సూసైడ్ చేసుకోవడం లాంటి దిక్కుమాలిన పనులను మానేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సూచనలు చేశారు. ప్రస్తుతం కేఏ పాల్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: