
ఏపీ: మాజీ ముఖ్యమంత్రి అయ్యిండి.. నల్లారికి పదవి రాకపోవడానికి కారణం..?
అయినప్పటికీ నల్లారి రాజ్యసభలో అయిన సీటును సంపాదించాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన అది కూడా వర్కౌట్ కాలేనట్లు కనిపిస్తోందట.ycp విజయసాయిరెడ్డి రాజీనామా తో ఖాళీ అయిన ఆస్థానం తనకే లభిస్తుందని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. కాంగ్రెస్లో పాత మిత్రుడైన ఒకరు బీజేపీలో ఉండడంతో అమిత్ షావద్దకు ఈ విషయాన్ని తీసుకువెళ్లేలా చేశారట. కూటమి ప్రభుత్వము కూడా ఇంకా విజయసాయిరెడ్డి రాజీనామా తో ఖాళీ అయిన స్థానాన్ని ఎవరికీ ఇవ్వాలనేది మాత్రం నిర్ణయించలేదు.
ఇటీవలే ఖాళీ అయినటువంటి 5 ఎమ్మెల్సీ పోస్టులలో ఒకటి బిజెపి తీసుకోక దీంతో ఒక రాజ్యసభ సీటును కూడా టిడిపి అడిగే అవకాశం ఉన్నదట. కాని బిజెపి కూడా సొంతంగా బలాన్ని పెంచుకునే పనిలో ఉన్నదట. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ రెడ్డి ఈ సీటు పైన ఆశలు భారీగానే పెట్టుకున్నప్పటికీ కానీ బిజెపి మాత్రం ఈయన పేరును పరిగణంలోకి కూడా తీసుకోలేదట. ఎందుకంటే చాలామంది నేతలు బిజెపి పార్టీని నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా ఉన్నారు.ముఖ్యంగా మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఇప్పటికే సీనియర్ లీడర్ కావడం చేత ఆస్థానాన్ని ఈయనకు బిజెపి ఇచ్చేటట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొక కీలకమైన నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ పదవి పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారట. గతంలో టికెట్ కోసం ప్రయత్నించిన అది ఫెయిల్ అవ్వడంతో ఈసారి ఈ సీటు పైన నమ్మకంగా ఉన్నారట. దీంతో వీరిద్దరూ బీజేపీ పార్టీకి సీనియర్ నేతలు కావడం చేత ఎవరూ కూడా అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండదు.