ఏపీ: వాలంటీర్ శకం ముగిసినట్టేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ పైన ఇటీవలే అసెంబ్లీలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ పలు కీలకమైన ప్రకటనలు చేయడం జరిగింది. ఈ మంత్రి చెప్పిన మాటలను చూస్తే ఇక మీదట వాలంటరీ వ్యవస్థ అనేది ఉండదనే విధంగా తెలియజేస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది ఆగస్టు నుంచి రాష్ట్రంలో వాలంటరీలు ఎవరూ లేరని క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రభుత్వం తాను రెగ్యులైజ్ చేస్తుందని ఇన్ని రోజులు ఆశగా ఎదురుచూస్తున్న వాలంటరీలందరూ కూడా ఇప్పుడు ఉసురు మంటున్నారు. ఈ రోజున వాలంటరీ వ్యవస్థ పైన ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సైతం మంత్రి ఇలా సమాధానాన్ని తెలియజేశారు.

రాష్ట్రంలో వాలంటరీలు ఎవరూ లేరని మంత్రి వీరాంజనేయ స్వామి తెలియజేశారు.. గత ఏడాది ఆగస్టు వరకే వాలంటరీ సేవలు కొనసాగించారని గత ప్రభుత్వం వారిని కొనసాగించ లేదంటూ కూడా తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటరీలు విధులలో లేనందువలన వారిని కొనసాగించలేమంటూ తేల్చి చెప్పారు. వైసిపి హయాంలో 2.50 లక్షల మంది వాలంటరీలను తీసుకోవడం జరిగింది వీరికి నెలకు 5000 రూపాయలు గౌరవ వేతనం కింద ఇచ్చారు.

వీరితో సంక్షేమ పథకాల దరఖాస్తులకు అలాగే పించిని పంపిణీ వంటివి చేయించేవారు. ఇవాళ వ్యవస్థ పైన అప్పట్లో తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేశారు కూటమినేతలు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రతిపక్షంగా ఉన్న కూటమి నేతలందరూ కూడా వాలంటరీలను విధులలోకి తీసుకోకూడదంటూ ఎలక్షన్ కమిషనర్ కు సైతం ఫిర్యాదులు చేశారు.. ఆ సమయంలో చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే వాలంటీలకు పదివేలు ఇస్తానని చెప్పి.. ఇప్పుడు చేతులెత్తేశారు మొత్తానికి ఏపీలో వాలంటరీ వ్యవస్థ శకం ముగిసినట్టే ముగిసినట్టుగా కనిపిస్తోంది అయితే దీంతో వాలంటరీల సైతం ఉద్యమానికి సిద్ధమవుతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన అటు సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: