తెలుగుదేశంకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హింట్ ఇదే.. ఈ విషయాలను గమనించారా?

Reddy P Rajasekhar
తక్కువ సినిమాలే చేసినా సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. సినీ హీరోగా పవన్ కళ్యాణ్ సృష్టించిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ స్పీచ్ ద్వారా టీడీపీకి పవన్ ఒక హింట్ ఇచ్చారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
పవన్ చెప్పిన మాటలను గమనిస్తే భవిష్యత్తులో కూడా కూటమిలోనే జనసేన కొనసాగుతుందని పవన్ స్పష్టం చేశారు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ అడుగులు పడుతున్నాయని ఆయన కామెంట్ల ద్వారా క్లియర్ గా అర్థమవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కు అంచనాలకు మించి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
 
అయితే రాష్ట్ర స్థాయిలో ఉన్న క్రేజ్ కు, జాతీయ స్థాయిలో ఉన్న క్రేజ్ కు ఎంతో తేడా ఉంటుంది. అందువల్ల పవన్ తాను జాతీయ స్థాయిలో ఎదగాలని భావిస్తున్నానని తన కామెంట్ల ద్వారా చెప్పకనే చెబుతున్నారు. జనసేన నేతల స్పీచ్ లను బట్టి ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. జనసేన భవిష్యత్తులో మరింత ఎదిగే విధంగా కూడా పవన్ కళ్యాణ్ అడుగులు పడనున్నాయని సమాచారం అందుతోంది.
 
కూటమి గెలవడానికి పవన్ కారణం అని నాగబాబు చెబుతుండగా అయితే పవన్ కు ప్రాధాన్యత కొనసాగాలని ఆ కామెంట్ల యొక్క అర్థం అని తెలుస్తోంది. ఈ విధంగా పవన్ అతి జాగ్రత్తగా అడుగులు వేస్తూ పార్టీలో తన స్థాయిని పెంచుకుంటూనే రాజకీయంగా ఎన్నో రెట్లు ఎదిగే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో జనసేన ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. పవన్ ను అభిమానించే అభిమానులు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: